టైప్రైటర్స్కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా' కుటుంబానికి ఉపాధి మార్గమైన టైప్‌రైటర్ పట్ల ప్రేమను తనదైన శైలిలో చాటుకున్నారు మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన ఓ వ్యక్తి. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 450 టైప్రైటర్లు సేకరించి.. ఓ మ్యూజియం స్థాపించారు రాజేశ్ శర్మ. భారత్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, చైనాలో తయారైన టైపింగ్ యంత్రాల్ని ఈ ప్రదర్శనశాలలో చూడొచ్చు.
"టైప్‌రైటింగ్.. మా తండ్రి వృత్తి. జిల్లా కోర్టు దగ్గర మా దుకాణం ఉండేది. ఇప్పటికీ ఉంది. అక్కడ న్యాయవాదుల కోసం మా తండ్రి టైప్‌రైటింగ్ చేసేవారు. చిన్నప్పుడు మేము వెళ్లి అక్కడ కూర్చునేవాళ్లం. టైప్రైటర్లతో, వాటి శబ్దాలతో మాకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. తర్వాత నేను వేరే వృత్తిలోకి వెళ్లాను. అయితే.. టైప్‌రైటింగ్ యంత్రాలు కనుమరుగు అయిపోతున్నాయని 7-8ఏళ్ల క్రితం అనిపించింది. అందుకే సేకరణ మొదలుపెట్టా. టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మొబైల్, కంప్యూటర్ వరకు వచ్చామని యువతరం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. టైప్‌రైటర్.. మొబైల్‌కు తండ్రి. ఇప్పుడు మొబైల్లో ఉన్న క్వర్టీ కీబోర్డ్ ఈ టైప్రైటర్స్ అన్నింటిలోనూ ఉంది."
-రాజేశ్ శర్మ, టైప్రైటర్ల మ్యూజియం వ్యవస్థాపకుడు
మ్యూజియంలోని టైప్రైటర్లు టైపింగ్ చేస్తున్న రాజేశ్ శర్మ 1890లో తయారైన అమెరికన్ ఇంగ్లిష్ టైప్‌రైటర్.. రాజేశ్ శర్మ మ్యూజియంలో ఉంది. మిగిలిన వాటిలో చాలావరకు 1910-1930 మధ్య తయారైనవే. 1922లో మెర్సిడెజ్ సంస్థ, రాయల్ కంపెనీ ఉత్పత్తి చేసిన టైప్రైటర్లనూ ఇక్కడ చూడొచ్చు. గోద్రెజ్, రెమింగ్టన్ టైపింగ్ యంత్రాలూ రాజేశ్ మ్యూజియంలో ఉన్నాయి. ప్రపంచంలో తొలి టైప్‌రైటర్‌ను తయారు చేసిన సంస్థగా రెమింగ్టన్ గుర్తింపు పొందింది. 1960-2000 మధ్య ట్రాంప్ కంపెనీ విడుదల చేసిన టైపింగ్ యంత్రాలూ.. ఇక్కడ ఉన్నాయి.
మ్యూజియంలోని టైప్రైటర్లు రాజేశ్ శర్మ ఏర్పాటు చేసిన మ్యూజియంలో కరోనా టైప్‌రైటర్ ప్రత్యేకమైనది. 1913లో కరోనా కంపెనీ దీనిని తయారు చేసింది. అప్పట్లో ఈ సంస్థ చాలా ఫేమస్. రెండున్నర కిలోల బరువుతో, చిన్నగా, మడత పెట్టి తీసుకెళ్లగలిగేలా ఉండే కరోనా టైప్‌రైటర్‌ను పోలీసు అధికారులు ఎంతగానే ఇష్టపడేవారని చెప్పారు రాజేశ్.
మ్యూజియం వ్యవస్థాపకుడు రాజేశ్ శర్మ