తెలంగాణ

telangana

ETV Bharat / bharat

swachh survekshan 2021:వరుసగా ఐదోసారి క్లీనెస్ట్​ సిటీగా 'ఇండోర్​' - cleanest city in india

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా(cleanest city in india ) మళ్లీ మధ్యప్రదేశ్​లోని ఇండోర్​ నగరమే(Indore cleanest city) నిలిచింది. స్వచ్ఛత సర్వేలో(swachh survekshan 2021) వరుసగా ఐదోసారి ఈ ఘనత సాధించింది. ఆ తర్వాతి స్థానంలో సూరత్​ నిలిచింది.

Indore cleanest city
వరుసగా ఐదోసారి క్లీనెస్ట్​ సిటీగా 'ఇండోర్​'

By

Published : Nov 20, 2021, 12:43 PM IST

Updated : Nov 20, 2021, 3:03 PM IST

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వార్షిక స్వచ్ఛత సర్వేలో మరోమారు దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది మధ్యప్రదేశ్​లోని ఇండోర్(Indore cleanest city)​. వరుసగా ఐదోసారి క్లీనెస్ట్​ నగరంగా ఘనత(cleanest city in india ) సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్​​ అవార్డ్​-2021లను((swachh survekshan 2021)) శనివారం ప్రకటించింది కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ.

పరిశుభ్రమైన నగరాల జాబితాలో రెండో స్థానంలో గుజరాత్​లోని సూరత్​, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నిలిచాయి. మహారాష్ట్రలోని నావీ ముంబయి తన స్థానాన్ని కోల్పోయింది. తాజా జాబితాలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 'స్వచ్ఛమైన గంగా నగరం'గా వారణాసికి అవార్డు లభించింది.

అవార్డు అందుకుంటున్న ప్రతినిధులు

రాష్ట్రాల జాబితాలో..

అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్​గఢ్​ అవార్డును(cleanest state in india ) కైవసం చేసుకుంది. 100కుపైగా పట్టణాలున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లు రాష్ట్రాల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో.. స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులను విజేతలకు అందించారు రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్​.

కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు, అధికారులు

4,320 నగరాలపై సర్వే..

స్వచ్ఛా సర్వేక్షణ్​ అవార్డ్స్​-2021లో దేశవ్యాప్తంగా 4,320 నగరాలపై 28 రోజుల పాటు సర్వే నిర్వహించింది కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ. 4.2 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది.

  • 100లోపు పట్టణాలు కలిగిన రాష్ట్రాల్లో ఝార్ఖండ్​ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా, గోవాలు ఉన్నాయి.
  • ఒక లక్షకుపైగా జనాభా కలిగిన పట్టణాల్లో టాప్​-10లో ఇండోర్​, సూరత్​, విజయవాడ, నావీ ముంబయి, దిల్లీ, అంబికాపుర్​, తిరుపతి, పుణె, నొయిడా, ఉజ్జయనీలు ఉన్నాయి. లఖ్​నవూ 25వ స్థానంతో సరిపెట్టుకుంది.
  • లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని విటా సిటీ.. తొలి ర్యాంక్​ సాధించింది. ఆ తర్వాత లోనావాలా, సస్వాద్​లు నిలిచాయి.
  • పరిశుభ్రమైన చిన్న నగరాల జాబితాలో దిల్లీ మున్సిపల్​ కౌన్సిల్​ తొలి స్థానంలో నిలిచింది. ఫాస్టెస్ట్​ మూవర్​ స్మాల్​ సిటీగా హొశంగవాడ.. ప్రజలకు నచ్చిన బెస్ట్​ స్మాల్​ సిటీగా త్రిపుటిలు నిలిచాయి. పరిశుభ్రమైన మధ్యంతర నగరంంగా నొయిడా నిలిచింది.
  • సఫాయిమిత్రా సురక్షా ఛాలెంజ్​లో నావీ ముంబయి తొలి ర్యాంక్​ సాధించింది. 10-40 లక్షల జనాభా గల నగరాల్లోనూ తొలిస్థానం కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి:స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్​ మళ్లీ నెం.1

Last Updated : Nov 20, 2021, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details