తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా! - డీజీసీఐ విచారణ

IndiGo Sharjah-Hyderabad flight diverted to Paks Karachi
IndiGo Sharjah-Hyderabad flight diverted to Paks Karachi

By

Published : Jul 17, 2022, 8:57 AM IST

Updated : Jul 17, 2022, 3:32 PM IST

08:51 July 17

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!

Indigo Flight Diverted: షార్జా నుంచి హైదరాబాద్​ వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం పాకిస్థాన్​లోని కరాచీ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ అయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్​.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్​లైన్స్​ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల్ని హైదరాబాద్​ రప్పించేందుకు భారత్​ నుంచి పంపిన మరో విమానం కరాచీ చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. విమానంలో మొత్తం 125 మందిని సురక్షితంగా హైదరాబాద్​ చేర్చనున్నట్లు పేర్కొంది.

రెండు వారాల క్రితమే కరాచీలో.. భారత ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం ఆకస్మికంగా కరాచీలో ల్యాండ్​ అవడం.. 2 వారాల వ్యవధిలో రెండో ఘటన కావడం గమనార్హం. దిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్​జెట్​ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్​లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. అప్పుడు ఫ్యూయల్​ ఇండికేటర్​ సరిగా పనిచేయలేదు. ఆ ఎస్​జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్​జెట్​ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్​ను భారత్​ నుంచి పంపారు. అప్పటివరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు

72 గంటల్లో నాలుగు విమానాలు.. గత 72 గంటల్లో నాలుగు విమానాలు ఎమర్జెన్సీ లాండ్​ అయ్యాయి. శనివారం షార్జా నుంచి కొచ్చికి బయలుదేరిన జీ9-426 విమానంలో హైడ్రాలిక్​ సమస్య తలెత్తి.. మొదలైన కాసేపటికే రన్​వేపైన పైలట్లు నిలిపివేశారు. జులై 15న అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్​కు బయలుదేరిన ఎయిర్​లైన్స్​ విమానం పలు కారణాలు వల్ల కోల్​కతా విమానాశ్రయానికి మళ్లించారు అధికారులు. అదే రోజు, శ్రీలంక ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానాన్ని చెన్నై ఎయిర్​పోర్ట్​లో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేశారు. తాజాగా ఆదివారం.. షార్జా నుంచి హైదరాబాద్​ వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం పాకిస్థాన్​లోని కరాచీ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ అయింది.

విచారణకు డీజీసీఐకు ఆదేశం..ప్రయాణికులతో బయలుదేరిన పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు.. ఇటీవల తరచుగా అత్యవసరంగా ల్యాండ్​ అవుతున్నాయి. వివిధ సాంకేతిక సమస్యలు కారణంగా ల్యాండ్​ చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలపై డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్ (డీజీసీఐ) విచారణకు ఆదేశించింది.

ఇవీ చూడండి:స్పైస్​జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్! ఒకే రోజులో రెండు..17 రోజుల్లో ఏడు

Last Updated : Jul 17, 2022, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details