తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఉప్పెన: దేశంలో మరో 3.79 లక్షల కేసులు - భారత్​లో కరోనా మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,79,257 కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండోరోజు 3 వేల మందికి పైగా మరణించారు. 2 లక్షల 70 వేల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

India corona cases
కరోనా కేసులు

By

Published : Apr 29, 2021, 9:44 AM IST

Updated : Apr 29, 2021, 1:20 PM IST

భారత్​లో కరోనా ప్రళయం సృష్టిస్తుంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 3,79,257 కేసులు వెలుగుచూశాయి. మరో 3,645 మరణాలు సంభవించాయి. కొత్తగా 2,69,507 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 1,83,76,524
  • మొత్తం మరణాలు: 2,04,832
  • మొత్తం కోలుకున్నారు: 1,50,86,878
  • మొత్తం యాక్టివ్​ కేసులు: 30,84,814

కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్​ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 15 కోట్ల 20లకు పైగా టీకాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీట్​ వ్యూహంతో వైరస్​ వ్యాప్తి నియంత్రణకు అధికారులు ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం.. 17,68,190 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 28 కోట్ల 44 లక్షల 71 వేలు దాటింది.

ఇదీ చూడండి:భారత్​కు.. అమెరికా 100 మి.డాలర్ల వైద్య సామగ్రి సాయం

Last Updated : Apr 29, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details