తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ నిర్మాణ మహా యజ్ఞంలో ఎన్​ఈపీ కీలకం' - నరేంద్ర మోదీ

దేశ నిర్మాణం అనే మహా యజ్ఞంలో జాతీయ నూతన విద్యా విధానం(ఎన్​ఈపీ) ఒక కీలకమైన ప్రాజెక్టుగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్​ఈపీ అమలులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతున్న క్రమంలో విద్యారంగంలో కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు.

new National Education Policy
మోదీ

By

Published : Jul 29, 2021, 5:48 PM IST

Updated : Jul 29, 2021, 6:01 PM IST

భారత విద్యా వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ.. తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యావిధానం-2020(ఎన్​ఈపీ) అమలులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా.. విద్యారంగంలో అకాడమిక్​ బ్యాంక్​ ఆఫ్​ క్రెడిట్స్​, నేషనల్​ డిజిటల్​ ఎడ్యుకేషన్​ ఆర్కిటెక్చర్​ వంటి కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

నేషనల్​ డిజిటల్​ ఎడ్యుకేషన్​ ఆర్కిటెక్చర్​

" జాతీయ నూతన విద్యా విధానం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిఒక్కరికి నా అభినందనలు. లక్షల మంద పౌరులు, ఉపాధ్యాయులు స్వతంత్ర సంస్థల సలహాల సాయంతో కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ దశల వారీగా ఎన్​ఈపీని అమలు చేయగలిగాం. దేశ నిర్మాణం కోసం చేపట్టిన మహా యజ్ఞంలో కీలక ప్రాజెక్టు ఇది. పిల్లలకు అందించే విద్యపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దేశ యువతకు స్వేచ్ఛ కావాలి. దేశం పూర్తిగా వారితోనే ఉందని యువతకు ఈ కొత్త విధానం భరోసా కల్పిస్తోంది. కృత్రిమ మేధా(ఏఐ) కార్యక్రమం ప్రారంభించాం. దాని ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్​ కళాశాలలు హిందీ, తమిళ​, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో బోధన ప్రారంభించపోతుండటం చాలా సంతోషంగా ఉంది "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మాతృ భాషలోనే విద్యా బోధన

జాతీయ విద్య నిజమైన అర్ధంలో జాతీయ విద్యగా మారాలంటే అది జాతీయ పరిస్ధితులకు అద్దం పట్టాలని మహాత్మాగాంధీ అంటూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు మోదీ. మహాత్మాగాంధీకి ఉన్న ఇలాంటి దూరదృష్టితో కూడిన ఆలోచనను నెరవేర్చేందుకు మాతృభాషలో విద్య అనే అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చామన్నారు. దీని వల్ల అత్యధిక లాభం దేశంలోని పేదలు, గ్రామీణ ప్రాంతంలో ఉండే మధ్యతరగతి విద్యార్ధులు, దళితులు, వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్ధులు, ఆదివాసీ విద్యార్ధులకు కల్గుతుందని పేర్కొన్నారు. మాతృభాషలో విద్య వల్ల పేద విద్యార్ధుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారి సామర్ధ్యానికి, ప్రతిభకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రారంభ విద్యలో కూడా మాతృభాషను ప్రోత్సహించే పని ఆరంభమైందని స్పష్టం చేశారు.

జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న క్రమంలో విధానపరమైన సంస్కరణలు చేపట్టినట్లు గుర్తు చేసుకున్నారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​. యావత్​ ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న క్రమంలో మన ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చిందన్నారు.

ఇదీ చూడండి:వైద్యవిద్యలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఖరారు

Last Updated : Jul 29, 2021, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details