తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ మిలిటరీ చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణకు చిక్కులు! - ఐఏఎఫ్​

సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఐఏఎఫ్​ చీఫ్​ మార్షల్​ భదౌరియా మధ్య విభేదాలు తలెత్తాయా? 'దేశ రక్షణలో ఐఏఎఫ్​ది సహాయక పాత్ర' అన్న సీడీఎస్​ వ్యాఖ్యలపై భదౌరియా అసహనం వ్యక్తం చేయడం వల్ల ఈ ప్రశ్న మరింత బలపడుతోంది. ఈ పరిణామాలతో మిలిటరీ వ్యవస్థలోనే అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్​ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Theatre plan
ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్

By

Published : Jul 3, 2021, 11:11 AM IST

ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్(Integrated Theatre Command)​.. దేశంలోని త్రివిధ దళాల వనరులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు తలపెట్టిన అతిపెద్ద సంస్కరణ ఇది. దీనికి ఓ రూపాన్ని ఇచ్చేందుకు ఆర్మీ, నేవీ, వాయు సేనల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ సంస్కరణకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. థియేటర్​ కమాండ్​లోని పలు ప్రతిపాదనలపై భారత వాయుసేన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇది పరిష్కరించగలిగే సమస్యే అయినప్పటికీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇందుకు కారణం త్రిదళాధిపతి​ జనరల్​ బిపిన్​ రావత్(CDS Bipin Rawat)​, ఐఏఎఫ్​ చీఫ్​ మార్షల్​ ఆర్​కే భదౌరియా(RK Bhadauria) మధ్య విభేదాలు రాజుకోవడం. దీంతో థియేటర్​ కమాండ్​ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'సహాయక పాత్ర'పై విభేదాలు..

సింగిల్​ ఎయిర్​ డిఫెన్స్​ కమాండ్​ను ఏర్పాటు చేసేందుకు ఐఏఎఫ్​(IAF)కు అవకాశం ఇవ్వకూడదని సీడీఎస్​ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో వాయుసేనది 'సహాయక పాత్ర' అని పేర్కొన్నారు. బిపిన్​ రావత్​ వ్యాఖ్యలపై ఐఏఎఫ్​ చీఫ్​ మార్షల్​(IAF chief marshal) అసహనం వ్యక్తం చేశారు. వాయుసేనది కేవలం సహాయక పాత్ర కాదని తెలిపారు.

"ఐఏఎఫ్​ది సహాయక పాత్ర కాదు. దేశ రక్షణలో వాయుసేనది కీలక పాత్ర. యుద్ధ ప్రాంగణంలో వాయుసేన కేవలం సహాయం చేయదు. ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుంది. గగనతలం రక్షణకు మాత్రమే ఐఏఎఫ్​ కట్టుబడి ఉండదు. భూమి మీద భద్రతా దళాలు ఆపరేషన్​ చేపడితే, గగనతలంలో వాయుసేన సహాయం అందిస్తుంది. శత్రువు భూభాగంలోకి ప్రవేశిస్తే, వారి రక్షణకు ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్​ ఏర్పాటుకు మా మద్దతుటుంది. కానీ అది సాధ్యపడటానికి క్లిష్టంగా ఉంది. దానిని ఎలా సాధించాలనేది అసలైన సమస్య. ఈ విషయాన్ని అంతర్గత చర్చల్లో లేవనెత్తాము. ఏం చేసినా సరిగ్గా చేయాలి. ఇది అత్యంత కీలకమైన సంస్కరణ."

--- ఆర్​కేఎస్​ భదౌరియా, ఐఏఎఫ్​​ చీఫ్ మార్షల్

ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్​ అంటే ఏంటి?

సీడీఎస్​ ఆధ్వర్యంలో దేశ మిలిటరీలో సంస్కరణలు, ఆధునికీకరణ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్​ను కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రస్తుత లక్ష్యం. సైన్యం, నేవీ, వాయు దళాలకు సంబంధించిన వనరులు(ఆస్తులు, సిబ్బంది, పరికరాలు) ఒక్క చోట చేర్చడమే ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్​. అంటే వేరువేరుగా కాకుండా.. ఒక్క కమాండరే ఇవన్నీ చూసుకుంటారు. ఆపత్కాలంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఏ దేశంలో ఎలా?

చైనా, అమెరికాలు ఈ ఇంటిగ్రేటెడ్​ థియేటర్​ కమాండ్​ వ్యవస్థను పాటిస్తున్నాయి. 2015లో చైనా తన మిలిటరీని థియేటర్​ కమాండ్​ కిందకి చేర్చి.. దేశంలోని 7 మిలిటరీ ప్రాంతాలను భౌగోళికంగా 5 థియేటర్​ కమాండ్లుగా మార్చింది. మరోవైపు అమెరికాకు 6 థియేటర్​ కమాండ్లు ఉన్నాయి.

అయితే భౌగోళికం, కార్యచరణ అవసరాల మేరకు భారత్​లో ప్రస్తుతం 17 కమాండ్లు ఉన్నాయి. అవి.. 6 ఆర్మీ కమాండ్లు, 1 శిక్షణా కమాండ్​, మూడు నేవీ కమాడ్లు, 5 ఐఏఎఫ్​ కమాండ్లు, ఒక శిక్షణ కమాండు, ఒక నిర్వహణ కమాండ్​.

-- సంజీవ్​ కే బారువా, సీనియర్​ పాత్రికేయులు.

ఇదీ చూడండి:-'భారత సైన్యం సత్తా ఏంటో చైనాకు అర్థమైంది'

ABOUT THE AUTHOR

...view details