దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు వాసుకిని విజయవంతంగా ప్రారంభించి దక్షిణ-తూర్పు రైల్వే రికార్డు సృష్టించింది. ఐదు కార్గో రైళ్లను జతచేసి 3.5 కిలోమీటర్ల వాసుకి రైలును ఏర్పాటు చేశారు.
జనవరి 22న ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి నుంచి రాయ్‌పూర్ రైల్వే డివిజన్లోని కోర్బావరకు నడిపి ఈ ఘనత సాధించింది దక్షిణ- తూర్పు రైల్వే. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 224కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల్లోనే వాసుకి పూర్తి చేసింది. కాగా భిలాయీ నుంచి కోర్బా కు బొగ్గు రవాణా చేయాడానికి వాసుకిని వాడనున్నారు.