దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014తో పోల్చితే 60శాతం వరకు పెరిగినట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఈ మేరకు చిరుత పులుల గణన నివేదిక 2018ని అటవీశాఖ అధికారుల సమక్షంలో దిల్లీలో విడుదల చేశారు. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో 12 వేల 852 చిరుత పులులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
భారత్లో భారీగా పెరిగిన చిరుతల సంఖ్య
దేశంలో చిరుత పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2014తో పోల్చితే 60 శాతానికి పైగా వృద్ధి రేటు నమోదైనట్లు తెలిపింది.
భారత్లో 12,852 కు చేరిన చిరుతపులులు
వన్యప్రాణుల సంరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు... చిరుత పులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయని జావడేకర్ సంతోషం వ్యక్తం చేశారు.