తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గగన్​యాన్​పై కరోనా ప్రభావం- ఏడాది వాయిదా - గగన్​యాన్​

కరోనా మహమ్మారి కారణంగా భారత్​ చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్​యాన్​ మరో ఏడాది పాటు ఆలస్యం అయ్యేలా ఉంది. గగన్​యాన్​ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్​లో చేపట్టాల్సిన తొలి మానవ సహిత మిషన్​ ఆలస్యం కానుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

India's human space flight mission likely to be delayed by one year due to pandemic
తొలి మానవరహిత ప్రయోగం మరో ఏడాది వాయిదా!

By

Published : Dec 7, 2020, 3:52 PM IST

భారత్​ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్​యాన్​ ప్రాజెక్టుపై కరోనా ప్రభావం పడింది. గగన్​యాన్​ మిషన్​లో భాగంగా.. 2020 డిసెంబర్​లో చేపట్టాల్సిన తొలి మానవ సహిత ప్రయోగం​ మరో ఏడాది పాటు వాయిదా పడినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.

"కరోనా కారణంగా గగన్​యాన్​ మానవ సహిత ప్రాజెక్ట్​ మరింత ఆలస్యం కానుంది. వచ్చే ఏడాది చివరి నాటికి కానీ లేక 2022 ప్రథమార్థంలో చేయడమే లక్ష్యంగా పెట్టకున్నాము. మొదటగా మానవ రహిత ప్రయోగం విజయవంతం అయితే తరువాతగా మానవ సహిత ప్రయోగం చేపడతాం. ఇదే క్రమంలో చంద్రయాన్​-3 ప్రయోగానికి కూడా సిద్ధం అవుతున్నాం. దీని లాంఛింగ్​కు సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదు." అని తెలిపారు ఇస్రో ఛైర్మన్ కె.శివన్.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details