Shivangi Singh Rafale: భారత 73వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ సైనిక సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా పరేడ్‌ను ఘనంగా సాగింది. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో ఆద్యంతం పరేడ్ ఆకట్టుకుంది.
పరేడ్‌లో సైన్యం, వాయుసేన, నావికాదళం, కేంద్ర పారాబలగాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు భాగమయ్యాయి. పలు ఆయుధ వ్యవస్థలు, యుద్ధట్యాంకులు, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది.
రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి..
Rafale Tableau: రఫేల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్.. భారత వాయుసేన శకటంతో పాటు కవాతులో పాల్గొన్నారు. ఐఏఎఫ్ శకటం పరేడ్‌లో భాగమైన రెండో మహిళా ఫైటర్ జెట్ పైలట్ శివాంగినే కావడం విశేషం. గతేడాది ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్.. పరేడ్‌లో పాల్గొని ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఫైటర్ జెట్ పైలట్‌గా నిలిచారు.
వారణాసికి చెందిన శివాంగి 2016లో ఐఏఎఫ్‌కి ఎంపికైంది. 2017లో ఏర్పాటైన రెండో మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో సభ్యురాలీమె. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక.. రాజస్థాన్ సరిహద్దులోని వైమానిక స్థావరంలో విధుల్లో చేరింది. ఇక్కడే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వద్ద శిక్షణ పొందే అవకాశం దొరికింది. మిగ్-21 కఠినమైన ఫైటర్ జెట్. దీన్ని అత్యంత ఎత్తు నుంచి కిందకి దింపేటప్పుడు, టేకాఫ్ చేసేటప్పుడు గంటకు 340 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. శివాంగి దీన్ని నడపడంలో అసాధారణ ప్రతిభాపాటవాలని ప్రదర్శించి రఫేల్ నడిపే అర్హత సాధించింది.
1946 తిరుగుబాటు థీమ్‌తో నేవీ శకటం..