తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Fungus: ఈ సారి 'స్కిన్​ బ్లాక్​ ఫంగస్'​- దేశంలో తొలి కేసు - చిత్రదుర్గలో చర్మానికి పాకిన బ్లాక్​ ఫంగస్​

కర్ణాటక చిత్రదుర్గలో దేశంలోనే మొట్టమొదటి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌(Fungus) కేసు నమోదైంది. చిత్రదుర్గలోని 50 ఏళ్ల రోగిలో ఈ ఫంగస్‌ను(Fungus) కనుగొన్నట్లు వైద్యుల బృందం వెల్లడించింది.

black fungus, skin black fungus
స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు

By

Published : Jun 2, 2021, 7:41 AM IST

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో దేశంలో మొదటి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌(Fungus) కేసు నమోదవ్వడం కలకలం రేపింది. చిత్రదుర్గ జిల్లాలో 50 ఏళ్ల రోగిలో స్కిన్ బ్లాక్‌ ఫంగస్‌(Fungus) కనిపించిందని దేశంలో ఇదే మొదటి కేసు అని వైద్యుల బృందం వెల్లడించింది. నెల క్రితం కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న బాధితుడి చర్మంపై బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మధుమేహం కూడా ఉందని వివరించారు.

పూర్తయిన సర్జరీ

బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా ఇప్పుడు రెండో దశ చికిత్సకు సిద్ధమవుతున్నారు.

చెవికి పాకిన బ్లాక్​ ఫంగస్​

ఇదీ చూడండి:Black Fungus: మెదడుకూ పాకిన వ్యాధి

ABOUT THE AUTHOR

...view details