తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐవీఎఫ్​ పద్ధతిలో పుంగనూర్​ లేగదూడ జననం- దేశంలోనే తొలిసారి!

First IVF Calf of Punganur: అంతరించిపోతున్న పశుజాతుల్లో ఒకటైన పుంగనూర్​ జాతి ఆవు దూడకు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్​) ద్వారా పురుడు పోశారు అధికారులు. ఈ సాంకేతికతను ఉపయోగించి జన్మించిన తొలి పుంగనూర్​ జాతి ఆవు దూడ ఇదే అని మహారాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది.

First IVF Calf of Punganur
ఐవీఎఫ్​ పద్ధతిలో పుట్టిన పుంగనూర్​ జాతి ఆవు దూడ

By

Published : Jan 11, 2022, 5:50 PM IST

First IVF Calf of Punganur: ప్రపంచవ్యాప్తంగా పొట్టిగా ఉండే పశువుల జాతుల్లో ఆంధ్రప్రదేశ్​లోని పుంగనూర్​ జాతి ఒకటి. ఇవి నానాటికీ అంతరించిపోతున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 500 కంటే తక్కువ ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే పుంగనూర్​ జాతికి చెందిన ఓ లేగ దూడ కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్​) పద్ధతి ద్వారా మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో జన్మించింది. దేశంలో ఈ సాంకేతికతను ఉపయోగించి పురుడు పోసుకున్న తొలి పుంగనూర్​ ఆవు దూడ ఇదే అని మహారాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది.

ఈ ప్రాజెక్ట్​ను కేంద్ర పాడిపరిశ్రమల శాఖ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖలు ఉమ్మడిగా చేపట్టాయి. దేశీయంగా అంతరించిపోతున్న పశువులను సంరక్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాయి.

ఐవీఎఫ్​ పద్ధతిలో పుట్టిన పుంగనూర్​ జాతి ఆవు దూడ

దేశీయ జాతుల ఆవు పాలల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆ పాలు వ్యాధుల నుంచి పోరాడే శక్తిని అధికంగా కలిగి ఉంటాయని అన్నారు. అయితే వేర్వేరు కారణాల రీత్యా కొన్ని దశాబ్దాలుగా దేశీయ పశుసంపద తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అరుదైన గోవులను రక్షించేందుకు పశుసంవర్ధక శాఖ కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్​) పద్ధతిని ప్రోత్సహిస్తోందని చెప్పారు. పుంగనూర్​ జాతి ఆవులనే మాత్రమేగాక.. బన్ని, తార్పాకర్, ఒంగోలు లాంటి మేలిమి జాతులను ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

గతేడాది అక్టోబర్​లో గుజరాత్ సోమనాథ్​ జిల్లాలో బన్ని బ్రీడ్​కు చెందిన గేదె ఐవీఎఫ్​ పద్ధతిన మగ లేగదూడ జన్మించింది. రాజస్థాన్​లోని సూరత్​ఘర్​లో ఇదే సాంకేతికతతో తార్పాకర్ జాతికి చెందిన మొదటి దూడను ప్రసవించేలా చేశారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు జన్యుపరంగా మేలిమి గేదెల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రక్రియ చేపట్టామని అన్నారు.

బన్ని జాతి గేదె దాని స్థితిస్థాపకత, శుష్క వాతావరణంలో అధిక పాల ఉత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అందుకే పాల ఉత్పత్తి వృద్ధికి జన్యుపరంగా అత్యంత మేలు రకమైన ఈ గేదెల సంఖ్యను పెంచడం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ బన్ని బ్రీడ్​ గేదె గిర్​సోమ్​నాథ్​లోని ధనేజ్​ గ్రామానికి చెందిన పాడి రైతు దగ్గర ఉంది.

ఇదీ చూడండి:'లక్కీ' గొర్రె పిల్ల వయసు 7 రోజులు.. ధర రూ.2 లక్షలు!

ABOUT THE AUTHOR

...view details