భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక-ఐఏసీని వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. విమాన వాహక నౌక నిర్మాణంలో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు. ఐఏసీని దేశ శక్తిసామర్థ్యాలకు నిదర్శనంగా అభివర్ణించారు.
వచ్చే ఏడాది ప్రారంభించనున్న ఐఏసీని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి అంకితం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.