భారత్‌లో తయారు చేసిన తొలి యుద్ధ నౌక.. విక్రాంత్‌ను నౌకాదళం బుధవారం సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టింది. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌కు 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా ఈ యుద్ధనౌకను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఓ చారిత్రక అడుగు అని పేర్కొన్నారు.
ఈ ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్ తయారీతో స్వదేశీ పరిజ్ఞానంతో దీటైన యుద్ధనౌకలు ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఈ విక్రాంత్.. భారత్‌లో రూపొందించిన తొలి అతిపెద్ద యుద్ధనౌక అని తెలిపారు.