దేశంలో కరోనా సోకిన తొలి వ్యక్తి మరోసారి మహమ్మారి బారిన పడ్డారు. కేరళ త్రిస్సూర్‌కు చెందిన ఓ వైద్య విద్యార్థినికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే ఆమెలో ఎలాంటి లక్షణాలను గుర్తించలేదని పేర్కొన్నారు.
చదువు రీత్యా ఆమె దిల్లీ వెళ్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం బాధితురాలు ఇంట్లోనే చికిత్స పొందుతోందని.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు.