భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య(Coronavirus update) భారీగా తగ్గింది. తాజాగా 26,115 మందికి కొవిడ్ (Covid cases in India) పాజిటివ్‌గా తేలింది. మరో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 34,469 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:3,35,04,534
- మొత్తం మరణాలు:4,45,385
- మొత్తం కోలుకున్నవారు:3,27,49,574
- యాక్టివ్ కేసులు:3,09,575
పరీక్షలు
సెప్టెంబర్ 20న మొత్తం 14 లక్షల 13 వేలకుపైగా కరోనా టెస్టులు(Testing update for covid-19) నిర్వహించారు. దీంతో మొత్తం కొవిడ్ పరీక్షల సంఖ్య 55,50,35,717కు చేరింది.
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 81,85,13,827 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సోమవారం ఒక్కరోజే 96,46,778 వ్యాక్సిన్ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో (Global corona virus update) పెరుగుదల నమోదైంది. కొత్తగా 3,97,618 మందికి కరోనా (Corona update) సోకినట్లు తేలింది. మహమ్మారి ధాటికి మరో 5,675 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,98,19,587కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,13,421కు పెరిగింది.
ఆయా దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 86,072
- బ్రెజిల్ - 7,884
- రష్యా - 19,744
- బ్రిటన్ - 36,100
- టర్కీ - 27,688
- ఇరాన్ - 17,397
ఇదీ చూడండి:ఆ భాజపా నేతకు 5 డోసుల వ్యాక్సిన్.. ఆరో డోసుకు షెడ్యూల్ !