నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్ఓ)ను(nasa orbiter) ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భారత్కు చెందిన చంద్రయాన్-2 వ్యోమనౌక(india chandrayaan 2) కీలక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో(isro news today) వెల్లడించింది. ప్రమాదానికి గురికాకుండా చేయగలిగినట్లు తెలిపింది.
చంద్రయాన్-2 ఆర్బిటర్(సీహెచ్2ఓ)(chandrayaan 2 news), ఎల్ఆర్ఓ చంద్రుడి ఉత్తర ధృవంలో.. అత్యంత సమీపంలోకి ఈ ఏడాది అక్టోబర్ 20న 05.45యూటీసీ( ఉదయం 11.15 ఐఎస్టీ) వస్తాయని గుర్తించినట్లు బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తోన్న అంతరిక్ష ఏజెన్సీ తెలిపింది. అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు రెండు స్పేస్క్రాఫ్ట్స్ మధ్య కేవలం 100మీటర్ల రేడియల్ దూరం ఉంటుందని ఒకవారం ముందు అంచనా వేసింది. ఆ సమయానికి అవి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో అత్యంత సమీపానికి వచ్చి ఢీ కొట్టుకోకుండా చూసేందుకు క్యామ్'(సీఏఎం)(collision avoidance maneuver) అవసరమని నాసా, ఇస్రోలు(isro news) భావించినట్లు తెలిపింది.
పరస్పర అంగీకారం మేరకు చంద్రయాన్-2(chandrayaan 2 news) క్యామ్ ప్రక్రియను చేపట్టేందుకు నిర్ణయించారు. అందుకు అక్టోబర్ 18వ తేదీని ఖరారు చేశారు. రెండు నౌకలు భవిష్యత్తులోనూ సమీపానికి వచ్చే క్రమంలో తగినంత రేడియల్ దూరం ఉండేలా ఈ ప్రక్రియను రూపొందించారు. అక్టోబర్ 18న 14.52 యూటీసీ(రాత్రి 8.22) ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. విజయవంతంగా పూర్తయిన తర్వాత చంద్రయాన్-2 ఆర్బిట్ డేటా ప్రకారం భవిష్యత్తులోనూ ఎప్పుడు ఎల్ఆర్ఓతో ప్రమాదకరంగా అత్యంత సమీపానికి వచ్చే అవకాశం లేదనే అంచనాకు వచ్చినట్లు వెల్లడించింది.
అంతరిక్ష వస్తువులు, శిథిలాలతో ఢీకొనే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు క్యామ్ ప్రక్రియను భూకక్ష్యలోని శాటిలైట్లకు నిర్వహించటం సాధారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రమాదకరంగా వ్యోమనౌకలు సమీపంలోకి వచ్చే అంశంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఇస్రో తెలిపింది. అలాంటి ప్రమాదం ఎదురైనప్పుడు క్యామ్ ప్రక్రియను నిర్వహిస్తామని పేర్కొంది. అయితే.. ఇస్రో ప్రయోగించిన వాటికి ఇలాంటి ప్రమాదం ఎదురవటం ఇదే తొలిసారని తెలిపింది.
ఇదీ చూడండి:చంద్రయాన్-2 ఘనత.. జాబిల్లి చుట్టూ 9 వేల సార్లు...