తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అక్కడ ఇంజినీరింగ్​ చేయాలంటే ఎన్​ఓసీ తప్పనిసరి' - ఏఐసీటీఈ

విదేశాల్లో ఇంజినీరింగ్​ చేయడంపై ఏఐసీటీఈ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్​లో ఇంజినీరింగ్​, ఇతర సాంకేతిక ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే నిరభ్యంతర పత్రం (ఏన్​ఓసీ) తప్పనిసరి అని స్పష్టం చేసింది.

pakistan engineering college
పాకిస్థాన్

By

Published : Oct 30, 2021, 7:44 AM IST

భారతీయులు, విదేశాల్లో నివసిన్తున్న భారత పౌరులు (ఓసీఐ) ఎవరైనా పాకిస్థాన్‌లోని ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకుంటే తమ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) తెలిపింది. మండలి నిర్దేశించిన ఫార్మాట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

విదేశీ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోబోయే ముందు ఆయా కోర్సుల గుర్తింపు అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని (ఏఐసీటీఈ) సూచించింది. కొన్ని విదేశీ కోర్సులకు మన దేశంలో గుర్తింపు లేకపోవడం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇదీ చూడండి :ఆలయంలోకి ప్రవేశించారని దళిత కుటుంబంపై దాడి

ABOUT THE AUTHOR

...view details