తెలంగాణ

telangana

ETV Bharat / bharat

219 మందితో ముంబయి చేరిన తొలి విమానం.. విద్యార్థుల హర్షం

Indians in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే క్రమంలో 219 మందితో బయలుదేరిన తొలి విమానం భారత్​కు చేరుకుంది. ముంబయిలోని విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పీయుష్​ గోయల్​ వీరికి స్వాగతం పలికారు.

Indians in Ukraine
ముంబయి చేరుకున్న తొలి విమానం

By

Published : Feb 26, 2022, 9:18 PM IST

Updated : Feb 26, 2022, 9:34 PM IST

Indians in Ukraine: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా తొలి విమానం ముంబయికి చేరుకుంది. కేంద్ర మంత్రి పీయుష్​ గోయల్ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రేయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రేయిన్​లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు. సురక్షితంగా భారత్​కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్​ నుంచి వచ్చిన భారతీయులకు స్వాగతం పలికిన పీయుష్​ గోయల్
కేంద్ర మంత్రి పీయుష్​ గోయల్​తో విద్యార్థి సెల్ఫీ

మాతృభూమికి స్వాగతం: పీయూష్​ గోయల్​..

ఉక్రెయిన్​ నుంచి వచ్చిన భారతీయులకు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ ముంబయి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వెల్​కమ్​ బ్యాక్​ టు మదర్​ ల్యాండ్​ అంటూ ట్వీట్​ చేశారు. ఉక్రెయిన్​ నుంచి సురక్షితంగా బయటపడి ముబయి విమానాశ్రయానికి చేరుకున్న భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం ప్రతి భారతీయుడి భద్రత కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. రెండో బ్యాచ్​ త్వరలోనే దిల్లీ చేరుకుంటుందని తెలిపారు.

రొమేనియా రాజధాని నగరం బుకారెస్ట్‌ నుంచి భారత్‌కు శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు ఈ విమానం బయలుదేరింది. ఆ దేశ సహకారంతో ఉక్రేయిన్​లో చిక్కుకున్న మిగతా వారిని కూడా స్వదేశానికి సురక్షితంగా చేర్చేలా కేంద్రం కృషి చేస్తోంది. 16వేల మందికిపైగా భారతీయులు ఉక్రేయిన్​లో చిక్కుకున్నారు.

ముంబయి చేరుకున్న భారతీయ విద్యార్థులు
ముంబయి ఎయిర్​పోర్టులో విద్యార్థులు

ఇదీ చూడండి :సుప్రీంకోర్టు బార్​ అధ్యక్షుడికి సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ బౌలింగ్​..!

Last Updated : Feb 26, 2022, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details