తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'న్యాయవ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించాలి' - జస్టిస్‌ మోహన్‌ ఎం శాంతానగౌడర్‌కు నివాళి

సమాజంలోని స్థానిక, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​.వి.రమణ(Cji Justice Ramana) అభిప్రాయపడ్డారు. దేశ న్యాయ వ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించడం ప్రస్తుతం చాలా అవసరమని పేర్కొన్నారు.

Cji Justice Ramana
సీజేఐ ఎన్​వీ రమణ

By

Published : Sep 18, 2021, 5:32 PM IST

దేశ న్యాయ వ్యవస్థలో భారతీయ స్ఫూర్తి ప్రతిబింబించడం ప్రస్తుతం చాలా అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​.వి.రమణ(CJI Justice Ramana) అన్నారు. బెంగళూరులో సుప్రీంకోర్టు దివంగత న్యాయమూర్తి జస్టిస్‌ మోహన్‌ ఎం శాంతానగౌడర్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో ఆయన(CJI Justice Ramana) పాల్గొన్నారు. సమాజంలోని స్థానిక, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా న్యాయవ్యవస్థను మార్చాలని అభిప్రాయపడ్డారు.

"ఈ రోజుల్లో కోర్టు తీర్పులు రావడానికి చాలా ఆలస్యం అవుతోంది. దీని వల్ల కక్షిదారులకు ఇబ్బంది కలుగుతుంది. సామాన్య ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినపుడు కోర్టులు, న్యాయమూర్తులను చూసి భయపడే పరిస్థితి ఉండకూడదు. కక్షిదారు నిజం చెప్పగలగాలి. కోర్టు వాతావరణాన్ని సౌకర్యవంతంగా చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులదే."

-జస్టిస్​ ఎన్​.వి.రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయడం సహా దాన్ని మరింత సమర్థవంతంగా అందించడం చాలా కీలకం అని జస్టిస్​ ఎన్​.వి.రమణ(Cji Justice Ramana) పేర్కొన్నారు. న్యాయస్థానాలు కక్షిదారు కేంద్రంగా పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయం అందించే ప్రక్రియ సులభతరంగా లేకపోవడం ఆందోళన కలిగించే అంశం అని అన్నారు.

ఇదీ చూడండి:సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్​ సింగ్​​ రాజీనామా

ABOUT THE AUTHOR

...view details