Indian Users Receiving 12 Cyber Fraud Messages Daily :ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ వినియోగం పెరిగినప్పటి నుంచి.. సైబర్ మోసాలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనాలను మోసం చేసేందుకు స్కామర్లు.. ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. వీటిపై పెద్దగా అవగాహన లేని సామాన్యులతోపాటు బాగా చదువుకున్నవారు సైతం ఈ రకం మోసాలకు బలవుతున్నారు. డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే.. ముఖ్యంగా ఫోన్లకు వచ్చే కొన్ని ఫేక్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లను నమ్మి మోసపోతున్నవారే అధికంగా ఉంటున్నారని.. ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) చెబుతోంది.
మెకాఫీ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీలో.. విస్తుపోయే విషయాలను వెల్లడించింది. ఈ-మెయిల్, సాధారణ మెసేజ్‌లు, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రతిరోజూ ఒక్కో వ్యక్తికి.. దాదాపుగా 12 ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఫేక్ జాబ్ నోటిఫికేషన్లు, ఆఫర్లు, బ్యాంక్ అలర్ట్స్ వంటి వివిధ రూపాల్లో మోసగాళ్లు చెలరేగిపోతున్నట్లు పేర్కొంది. ఇందులో.. 7 ఫేక్ మెసేజ్‌లు అత్యంత ప్రమాదకరమైనవి ఉంటున్నాయట. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- ఫేక్ జాబ్స్ :మంచి ఆఫర్లతో జాబ్ ఇస్తాం.. ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ మెసేజ్ పంపుతారు. తెలియని వారి నుంచి వచ్చే.. ఇలాంటి లింక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను జాబ్ పోర్టల్స్‌లో మాత్రమే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో లేదా మీ వాట్సాప్‌కు వచ్చే జాబ్ ఆఫర్ మెసేజ్‌లు, SMSలను నమ్మకూడదు. ఏ కంపెనీ కూడా మెసేజ్‌ల ద్వారా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోదు.
- ప్రైజ్ :మీకు ఒక ప్రైజ్ వచ్చింది, భారీగా డబ్బు గెల్చుకున్నారు అనే మెసేజ్.. అందరి ఫోన్లకూ ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది. ప్రజలను బురిడీ కొట్టించడానికి స్కామర్లు పంపే మెసేజ్ ఇది. ఇలాంటి మెసేజ్‌లో ఉండే లింక్‌పై క్లిక్ చేస్తే.. మన వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు మోసగాళ్ల చేతికి చిక్కడానికి 99% అవకాశం ఉంది.
- OTT సబ్ స్క్రిప్షన్ అప్‌డేట్స్ :ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌పామ్స్‌కు ఆదరణ పెరగడంతో.. స్కామర్లు నెట్‌ఫ్లిక్స్ లేదా ఇతర OTT సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ అంటూ ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారు. సబ్‌స్క్రిప్షన్ టైమ్ అయిపోతోందని, ఈ లింక్ క్లిక్ చేస్తే ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ వస్తుందని స్కామర్లు ఊరిస్తుంటారు.