Railway Jobs 2023: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏ విభాగంలోనైనా ఉద్యోగం సంపాదించాలనే కల అందరికి ఉంటుంది. అలాంటి వారికి శుభవార్త చెప్పింది రైల్వే రిక్రూట్మెంట్ సెల్. మొత్తం 1104 అప్రెంటీస్ రైల్వే కొలువులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈశాన్య రైల్వే (నార్త్ ఈస్టర్న్ రైల్వే)లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసినవారు ఈ అప్రెంటీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈశాన్య రైల్వే (నార్త్ ఈస్టర్న్ రైల్వే)లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇవి..
వర్క్‌షాప్ | పోస్టులు |
మెకానికల్ వర్క్‌షాప్- గోరఖ్‌పుర్ | 411 |
సిగ్నల్ వర్క్‌షాప్- గోరఖ్‌పుర్ | 63 |
బ్రిడ్జ్ వర్క్‌షాప్- గోరఖ్‌పుర్ | 35 |
మెకానికల్ వర్క్‌షాప్- ఇజ్జత్‌నగర్ | 151 |
డీజిల్ షెడ్- ఇజ్జత్‌నగర్ | 60 |
క్యారేజ్ అండ్ వేగన్- ఇజ్జత్‌నగర్ | 4 |
క్యారేజ్ అండ్ వేగన్- లఖ్‌నవూ జంక్షన్ | 155 |
డీజిల్ షెడ్- గోండా | 90 |
క్యారేజ్ అండ్ వేగన్- వారణాసి | 75 |
Railway Jobs Recruitment 2023 : పైన తెలిపిన వర్క్‌షాపుల్లోని ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానికల్ డీజిల్, ట్రిమ్మర్ విభాగాల్లో ఈడబ్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సెర్వీస్మెన్ సహా ఇతర కేటగిరీల రిజర్వేషన్ ఆధారంగా పోస్టులను విభజించి కేటాయించారు. ఏఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు కేటాయించారో వంటి పూర్తి వివరాలు indian railways.gov.in లేదా RRC-North Eastern Railway అధికారిక వెబ్సైట్లో వీక్షించొచ్చు.
ఈ వయసు వారు మాత్రమే..
నార్త్ ఈస్టర్న్ రైల్వే రీజియన్‌లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే 2023 ఆగస్టు 2 నాటికి 24 సంవత్సరాలు మించకూడదు.
వీరికి మాత్రమే వయోపరిమితి పెంపు..
- ఓబీసీ అభ్యర్థులు- 3 సంవత్సరాలు (24+3). అంటే ఈ కేటగిరీ వారు 2023 ఆగస్టు 2 నాటికి 27 సంవత్సరాలు దాటకూడదు.
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు- 5 సంవత్సరాలు (24+5). 2023 ఆగస్టు 2 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు.
- దివ్యాంగులు- 10 సంవత్సరాలు (24+10). 2023 ఆగస్టు 2 నాటికి 34 సంవత్సరాలు ఉండాలి.
- ఇక ఎక్స్-సెర్వీస్ మెన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితి నుంచి మినహాయింపులు ఉన్నాయి. www.ner.indianrailways.gov.in వెబ్సైట్లో ఈ వివరాలు చూడొచ్చు.