Indian Railway Rules For Passengers : మన దేశంలోనే అత్యంత తక్కువ ధర, సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చే రవాణా వ్యవస్థ.. భారతీయ రైల్వే. ప్రతి రోజు కొన్ని లక్షలమంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు ఇండియన్ రైల్వే కొన్ని రూల్స్‌ను రూపొందించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనవసరంగా చైన్ లాగితే నేరం!
రైల్లో మనం ప్రయాణించేటప్పుడు సాధారణంగా మన కోచ్‌లో పైకి ఏర్పాటు చేసి ఉన్న అలారంతో కూడిన గొలుసును చూసే ఉంటారు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు. ఆ గొలుసును ఎప్పుడు పడితే అప్పుడు లాగవచ్చా అని. అత్యవసరమైతే తప్ప అలాంటి పని ఎట్టి పరిస్థితుల్లోను మీరు చేయకూడదు.
ఈ సందర్భాల్లో చైన్ లాగడం అవసరమవుతుంది
- రైల్వే నిబంధనల ప్రకారం ఈ క్రింది సందర్భాల్లో మాత్రమే వాడాలి.
- అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు
- ప్రయాణికుడి భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు
- కోచ్‌లో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు
- పిల్లలు, వయో వృద్ధులు తప్పిపోయినప్పుడు
మీ ప్రయాణాన్ని పొడిగించుకోవచ్చు
పండగలు, పర్వదినాల వంటి ప్రత్యేక సందర్భాల్లో కొన్నిసార్లు మీరు వెళ్లాలనుకున్న ప్రాంతానికి రిజర్వేషన్‌ను మీరు చేసుకోలేకపోవచ్చు. అలాంటి వారికి రైల్వే ఓ వెసులుబాటు కల్పించింది. ప్రయాణికుడు వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని కంటే ముందు స్టేషన్ వరకు రిజర్వేషన్ చేసుకోవచ్చు. రైల్వే టీటీఈకి కొంత జరిమానా చెల్లించడం ద్వారా ఆయన మీకు మీ గమ్యస్థానానికి టికెట్ జారీచేస్తారు. ఏదేమైనప్పటికీ సీట్ విషయంలో కొన్ని తేడాలు ఉండవచ్చు.
Middle Berth Rule in Indian Railways :మిడిల్ బెర్త్ విషయంలో రైల్వేశాఖ అతి ముఖ్యమైన నిబంధనలు రూపొందించింది. మిడిల్ బెర్త్ అనేది ఎగువ బెర్త్, దిగువ బెర్త్‌కు మధ్యలో ఉంటుంది. ఉదయం పూట మిడిల్ బెర్త్‌ను ఉపయోగించకూడదనే నియమం ఉంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఆ బెర్త్‌పై నిద్రపోవచ్చు. ఒక వేళ ఎవరైనా ప్రయాణికుడు ఆ సమయాన్ని మించి ఉన్నట్లయితే ఆయన్ను అడిగే హక్కు మీకుంది.
టూ స్టాప్స్ నియమం
కొన్ని సార్లు ప్రయాణికుడు తాను ఎక్కాల్సిన స్టేషన్లో ట్రైన్ ఎక్కలేకపోవచ్చు. అలాంటి ప్రయాణికుల కోసం రైల్వే అవకాశం కల్పించింది. ఒక వేళ ఎక్కాల్సిన స్టేషన్లో ప్రయాణికుడు ట్రైన్లో లేకపోతే ఆ సీటును టికెట్ కలెక్టర్ వేరే వారికి బదిలీ చేయలేరు. ఓ గంట సమయం అవ్వాలి లేదంటే రెండు స్టేషన్లు అయినా దాటే వరకు ఆ సీట్‌ను వేరే వారికి కేటాయించరాదని రైల్వే నిబంధన.
ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దు..
రైల్లో సుదూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేసేందుకు ఓ నిబంధన ఉంది. వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదు. టీటీఈ కూడా ఆ సమయంలోపే వచ్చి టికెట్ చెక్ చేయాలి. ఆ సమయంలో కేవలం నైట్ లైట్లు తప్ప మిగిలిన వాటిని స్విఛ్చాఫ్ చేయాలి.
నిర్ణీత ధరకే అమ్మాలి..
మీరు బస్సు, విమానంలో ప్రయాణించేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో ధరకు తినుబండారాలు అమ్ముతుండటం గమనించే ఉంటారు. రైల్వే నిబంధనలు ప్రకారం ట్రైన్లో అలా చేయడానికి వీలులేదు. రైల్వే పాలక సంఘం ఏయే ధరలనైతే నిర్ణయిస్తుందో అంతకు మాత్రమే అమ్మాలి. అవి భోజనం అయినా సరే మరే తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ ఇలా ఏదైనా సరే. అమ్మే వారు ప్రయాణికుల వద్ద ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. అదే విధంగా ఆయా ఆహార పదార్థాలు నాణ్యతపరంగా మంచివై ఉండాలి. ఒక వేళ నాణ్యతా లోపమైన ఆహార పదార్ధాలను రైలులో అమ్మితే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు రైల్వే అధికారులకు అమ్మకందారుడి లైసెన్స్‌ను రద్దు చేస్తారు.
తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దు
రైలు ప్రయాణంచినప్పుడు ప్రతి ఒక్కరూ తోటి ప్రయాణికుడికి అసౌకర్యం కలగకుండా ప్రవర్తించాలి. ఈ విషయంపై రైల్వే శాఖ కఠినమైన నిబంధనలు రూపొందించింది. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగే విధంగా గట్టిగా అరవడం వంటి పనులు చేయకూడదు. ఒక వేళ మీరు సెల్ఫోన్లో వీడియో చూస్తున్నట్లయితే హెడ్‌ఫోన్స్ వాడాలని సూచిస్తోంది. లేదంటే తక్కువ సౌండ్పెట్టుకుని వినాలి. మీరు ఫోన్ మాట్లాడుతున్నట్లయితే నెమ్మదిగా మాట్లాడటం ఉత్తమం.
How To Get Lost Things In Train : రైలు ప్రయాణంలో మీ లగేజీ పోగొట్టుకున్నారా?.. అయితే మీ వస్తువులను తిరిగి పొందండిలా!
Train Ticket Transfer Process : రైలు ప్రయాణం వాయిదా పడిందా?.. ట్రైన్ టికెట్‌ను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోండిలా?