గేట్-2021 పరీక్షలో అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకునేందుకు జులై 26 వరకు గడువుచ్చింది. ఈసారి నియామక ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగనుంది.
ఇంజినీర్లు, ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామకం చేపట్టింది ఐఓసీఎల్. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో గేట్-2021 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారే ఈ పోస్టులకు అర్హులు. ఇతర విభాగాల వారు, గతంలో నిర్వహించిన గేట్ పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసినా పరిగణనలోకి తీసుకోరు.
దరఖాస్తు చేసిన వారిలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్ నిర్వహిస్తారు. చివరగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.
దరఖాస్తు ఎలా?
- ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక ఐఓసీఎల్ వెబ్సైట్లో నోటిఫికేషన్‌ను క్షుణ్నంగా చదవాలి
- మొదటగా ఓ ఈమెయిల్, మొబైల్ నంబర్‌తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వీటిని మార్చడానికి వీల్లేదు.
- రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. సూచనలన్నీ చదవాలి.
- దరఖాస్తుకు అవసరమైన కలర్ ఫొటో(6 నెలల లోపు దిగింది), సంతకం స్కాన్ చేసిన పత్రాలు ఉండాలి. ఆధార్ కార్డ్ కూడా అవసరం.
- గేట్-2021 రిజిస్ట్రేషన్ నంబర్, ఇంజినీరింగ్ విభాగం, స్కోరు వివరాలను నమోదు చేయాలి.
- రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలి. లేకపోతే దరఖాస్తు చెల్లదు.
ఇదీ చూడండి:Neet 2021: 'నీట్' పీజీ పరీక్ష తేదీ ఖరారు