కేరళలో భారీస్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది భారత నావికాదళం. అరేబియా మహా సముద్రంలో ఓ మత్స్యకార నౌకలో అక్రమంగా తరలిస్తున్న రూ.3వేల కోట్ల విలువైన విదేశీ మాదక ద్రవ్యాలను సోమవారం సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
భారత నావికాదళ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ సువర్ణ' ఈ ఆపరేషన్ను దిగ్విజయంగా నిర్వహించినట్టు సదరన్ నావల్ కమాండ్(ఎస్ఎన్సీ) అధికారికంగా వెల్లడించింది. తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు సదరు నౌకను కొచ్చి ఓడరేవుకు తరలించినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి:దిల్లీలో లాక్డౌన్- లిక్కర్ షాపుల ముందు భారీ క్యూ
"భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ సువర్ణ.. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో అనుమానాస్పద రీతిలో ఉన్న ఓ ఫిషింగ్ పడవను గుర్తించింది. దానిపై దర్యాప్తు చేసేందుకు ఓడరేవు బృందంతో ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. తద్వారా 300 కిలోలకుపైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది."