తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Indian Navy Jobs 2023 : ఐటీఐ అర్హతతో ఇండియన్​ నేవీలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! - ఇండియన్ నేవీ ఉద్యోగాలు 2023

Indian Navy Jobs 2023 10th Pass : ఇండియన్​ నేవీలో ట్రేడ్స్​మ్యాన్​ మేట్​ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. పదిలో ఉత్తీర్ణత సాధించి ఐటీఐ సర్టిఫికేట్​ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? జీతభత్యాలు ఎలా ఉంటాయి? అప్లికేషన్​ ఫీజు ఎంత? పోస్టింగ్​ ఎక్కడ కల్పిస్తారు? తదితర వివరాలు మీకోసం.

Indian Navy Tradesman Recruitment 2023
Indian Navy Jobs 2023 10th Pass

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 1:21 PM IST

Indian Navy Jobs 2023 10th Pass : ఇండియన్​ నేవీ - అండమాన్​ అండ్​ నికోబార్​ కమాండ్​ పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్​ కంట్రోల్​ కింద వివిధ నేవెల్​ విభాగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 362 ట్రేడ్స్​మ్యాన్ మేట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది భారత నౌకా దళం ( Indian Navy Tradesman Recruitment 2023 ). ఆగస్టు 26 నుంచి ప్రారంభమయిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్​ 25 వరకు కొనసాగనుంది.

మొత్తం ఖాళీలు..
Indian Navy Vacancy 2023 : 362పోస్టులు.

ఈ పోస్టులు..

  • ట్రేడ్స్​మ్యాన్ మేట్​- 338పోస్టులు
  • ట్రేడ్స్​మ్యాన్ మేట్ ( NAD-డాలీగంజ్​)- 24ఖాళీలు

అర్హతలు..

  • అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
  • గుర్తింపు కలిగిన ఐటీఐ ఇన్​స్టిట్యూట్​ నుంచి సంబంధిత విభాగానికి సంబంధించి సర్టిఫికేట్​ పొంది ఉండాలి.

ఏజ్​ లిమిట్​..
Indian Navy Tradesman Age Limit :దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.

విభాగాలు..
Indian Navy Join :ఐటీఐకి సంబంధించి మొత్తం 52విభాగాలవారు ట్రేడ్స్​మ్యాన్ మేట్​ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు..
Indian Navy Salary :రూ.18,000-రూ.56,900.

దరఖాస్తు రుసుము..
Indian Navy Tradesman Application Fee :ఎటువంటి అప్లికేషన్​ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.

ఎంపిక విధానం..

  • రాతపరీక్ష
  • మెడకల్​ టెస్టు
  • డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్​
  • ఫైనల్​ మెరిట్​ లిస్ట్​

దరఖాస్తుకు చివరితేదీ..
Indian Navy Tradesman Apply Last Date : ఆసక్తి గల అభ్యర్థులు 2023 సెప్టెంబర్​ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షా కేంద్రం..
Indian Navy Tradesman Exam Centre :కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్​ అండ్​ నికోబార్​ దీవులు రాజధాని పోర్ట్​ బ్లెయిర్​లో పరీక్షను నిర్వహిస్తారు. ఎగ్జామ్​ సెంటర్​కు సంబంధించి పూర్తి వివరాలు అడ్మిట్​కార్డ్​లో ఉంటాయి.

పరీక్షా సమయం..
Indian Navy Tradesman Exam : పరీక్ష సమయం 2 గంటలు. మల్టిపుల్​ ఛాయిస్​ విధానంలో రాతపరీక్షను నిర్వహిస్తారు.

ఇక్కడ పనిచేయాలి..!
Indian Navy Tradesman Mate Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు అండమాన్​ అండ్​ నికోబార్​ కమాండ్​ పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్​ కంట్రోల్​ కింద వివిధ నేవెల్​ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

వెబ్​సైట్​..
Indian Navy Website : పరీక్ష సిలబస్​ సహా ఇతర ముఖ్య సమాచారం కోసం అండమాన్​ అండ్​ నికోబార్​​ కమాండ్​ (ఇండియన్​ నేవీ) అధికారిక వెబ్​సైట్​ https://karmic.andaman.gov.in/HQANCను లేదా www.joinindiannavy.gov.inను చూడవచ్చు.

ABOUT THE AUTHOR

...view details