Indian Navy Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి గుడ్‌న్యూస్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 910 సివిలియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది భారత నౌకాదళం. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్టు (ఐఎన్‌సెట్) ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు. అర్హత ఉండి ఆసక్తి గల యువతీయువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివారులు
Indian Navy Jobs 2023 Vacancy Details :
ఛార్జ్‌మెన్ వర్క్‌షాప్ పోస్టుల వివరాలు(గ్రూప్-బీ)
మొత్తం ఖాళీలు - 22
ఛార్జ్‌మెన్ వర్క్‌షాప్‌కు కావాల్సిన విద్యార్హతలు
బీఎస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేదా కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఛార్జ్‌మెన్ ఫ్యాక్టరీ పోస్టుల వివరాలు(గ్రూప్-బీ)
మొత్తం ఖాళీలు- 20
ఛార్జ్‌మెన్ ఫ్యాక్టరీకు కావాల్సిన విద్యార్హతలు
బీఎస్సీ మ్యాథ్స్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ చదివి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల వివరాలు(గ్రూప్-బీ)
- ఎలక్ట్రికల్- 142
- మెకానికల్- 26
- కన్‌స్ట్రక్షన్- 29
- కార్టోగ్రాఫిక్- 11
- ఆర్మమెంట్- 50
సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్‌కు కావాల్సిన విద్యార్హతలు
- పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
- రెండేళ్ల డిప్లొమా లేదా డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
- దరఖాస్తు చేసుకున్న విభాగం ప్రకారం ఎలక్ట్రికల్/ మెకానికల్/ నేవల్ ఆర్కిటెక్చర్/ కార్టోగ్రఫీ వీటిలో ఎందులోనైనా మూడేళ్లు డ్రాయింగ్/ డిజైన్ అనుభవం తప్పనిసరి.
డ్రాఫ్ట్స్‌మెన్ మేట్ పోస్టుల వివరాలు(గ్రూప్-సీ)
- వెస్ట్రన్ నేవల్ కమాండ్- 565
- సదరన్ నేవల్ కమాండ్- 36
- ఈస్టర్న్ నేవల్ కమాండ్- 9
డ్రాఫ్ట్స్‌మెన్ మేట్‌కు కావాల్సిన విద్యార్హతలు
- పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ నిర్దేశిత ట్రేడుల్లో సర్టిఫికెట్ తప్పనిసరి.
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న 64 ఐటీఐ ట్రేడుల్లో ఏదైనా పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఏజ్ లిమిట్
Indian Navy Jobs 2023 Age Limit :(2023 డిసెంబరు 31 నాటికి)
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ ఉద్యోగాలకు 27 ఏళ్లు మించకూడదు.
- ఛార్జ్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లలోపు ఉండాలి.