Indian Navy INCET Notification 2023 : ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (INCET 01/2023) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
I. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-బి (ఎన్జీ), నాన్-గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్-మినిస్టీరియల్
- ఛార్జ్‌మ్యాన్ (అమ్యునిషన్ వర్క్‌షాప్) - 22 పోస్టులు
- ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ) - 20 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) - 142 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) - 26 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్స్ట్రక్షన్) - 29 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కార్టోగ్రాఫిక్) - 11 పోస్టులు
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (ఆర్మమెంట్) - 50 పోస్టులు
II. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ -సీ, నాన్-గెజిటెడ్, ఇండస్ట్రియల్
- ట్రేడ్స్‌మ్యాన్ మేట్ - 610 పోస్టులు
ట్రేడ్స్ : కార్పెంటర్, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రోప్లేటర్, సీవోపీఏ, ఇండస్ట్రియల్ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్
విద్యార్హతలు
Indian Navy INCET Qualification :ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
వయోపరిమితి
Indian Navy INCET Age Limit :
- 2023 డిసెంబర్ 31 నాటికి ఛార్జ్‌మ్యాన్/ ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
Indian Navy INCET Application Fee :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.295 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.