తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత అమ్ములపొదిలో 'పొసిడాన్​ 8ఐ-పీ8ఐ' - భారత అమ్ములపొదిలో చేరిన యుద్ధ విమానం

సముద్ర జలాలపై గస్తీ కాస్తూ.. శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడే యుద్ధ విమానం పొసిడాన్​ 8ఐ- పీ8ఐ.. భారత్​లో అడుగుపెట్టింది. అత్యంత శక్తిమంతమైన ఈ విమానాలు.. రాడార్ల సాయంతో ఆనుపానులు కనిపెట్టి.. ఆయుధాలతో విరుచుకుపడతాయని అధికారులు చెప్పుకొచ్చారు.

Indian Navy
భారత అమ్ములపొదిలో 'పొసిడాన్​ 8ఐ-పీ8ఐ'

By

Published : Nov 19, 2020, 6:43 AM IST

Updated : Nov 19, 2020, 7:08 AM IST

సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుంచే శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడే అత్యాధునిక పొసిడాన్ 8ఐ- పీ8ఐ యుద్ధ విమానం భారత నౌకాదళ అమ్ములపొదిలోకి చేరింది. అమెరికా రూపొందించిన ఈ విమానం.. బుధవారం గోవాలోని ఐఎన్​ఎస్ హన్స నౌకా స్థావరంలో దిగింది.

అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్ వ్యవస్థతో, రాడార్ల సాయంతో జలాంతర్గాముల ఆనుపానులు కనిపెట్టి ఆయుధాలతో విరుచుకుపడటం దీని ప్రత్యేకత అని అధికారులు చెబుతున్నారు. పీ8ఐ నాలుగు యుద్ధవిమానాల తయారీకి సంబంధించి.. 2016 జులైలో అమెరికాతో 1.1 బిలియన్ డాలర్లతో కేంద్రం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాలుగు పీ8ఐ యుద్ధవిమానాల్లో ప్రస్తుతం ఒక యుద్ధవిమానం చేరగా.. మిగతా మూడు వచ్చే ఏడాది సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:'చైనా మైక్రోవేవ్ దాడి'.. అవాస్తవం: భారత ఆర్మీ

Last Updated : Nov 19, 2020, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details