కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున భారతదేశం అంతటా ఆస్పత్రులు మెడికల్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనిని అధిగమించేందుకు విదేశాల నుంచి ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లను తీసుకురావడానికి భారత నావికాదళం ఏడు యుద్ధనౌకలను మోహరించింది.
'సముద్ర సేతు- II' ఆపరేషన్లో భాగంగా విదేశాల నుంచి ద్రవ ఆక్సిజన్, దాని అనుబంధ వైద్య పరికరాలను తీసుకురావడానికి మోహరించిన ఓడలు కోల్‌కతా, కొచ్చి, తల్వార్, తబార్, త్రికాండ్, జలాష్వా, ఐరావత్.
బహ్రెయిన్‌లోని మనమా నుంచి ఐఎన్‌ఎస్ తల్వార్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకువస్తుండగా, ఐఎన్‌ఎస్ కోల్‌కతా వైద్య సామాగ్రిని సేకరించడానికి దోహాకు వెళ్లిందని భారత నావికాదళం తెలిపింది. ద్రవ ఆక్సిజన్ ట్యాంకులను తీసుకురావడానికి ఓడ కువైట్ బయలుదేరుతుంది.
అరేబియా సముద్రంలో మోహరించిన కొచ్చి, త్రికండ్, టాబర్ మిషన్లతో కూడిన రెండవ బ్యాచ్ ఓడలు కూడా ఈ ఆపరేషన్లో పాలుపంచుకోవడానికి రంగంలోకి దిగాయి. దక్షిణ నావికాదళం నుంచి, ల్యాండింగ్ షిప్ ట్యాంక్ ఐఎన్ఎస్ షార్దుల్ 48 గంటల్లో ఆపరేషన్లో చేరడానికి సిద్ధంగా ఉంది అని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.