తెలంగాణ

telangana

ETV Bharat / bharat

INDIAN NAVY AGNIVEER : గుడ్​న్యూస్​.. నేవీలో 1365 పోస్టులకు నోటిఫికేషన్​ - agniveer jobs for female

INDIAN NAVY AGNIVEER RECRUITMENT 2023 : ఇండియన్​ నేవీ 1,365 అగ్నివీర్ (SSR)​ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 1,365 పోస్టుల్లో మహిళలకు 273 పోస్టులు రిజర్వ్​ చేసినట్లు స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థులు నేవీ యాక్ట్​ 1957 ప్రకారం 4 సంవత్సరాల పాటు మాత్రమే నేవీలో తమ సేవలు అందిస్తారని పేర్కొంది. పూర్తి వివరాలు మీకోసం..

INDIAN NAVY AGNIVEER RECRUITMENT 2023
ఇండియన్​ నేవీ అగ్నివీర్​ పోస్టులకు నోటిఫికేషన్​

By

Published : Jun 9, 2023, 4:19 PM IST

Updated : Jun 9, 2023, 4:30 PM IST

INDIAN NAVY AGNIVEER RECRUITMENT 2023 : భారత నౌకాదళంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు గుడ్​ న్యూస్​. ఇండియన్​ నేవీ 1,365 అగ్నివీర్​ (SSR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇందులో మహిళలకు 273 పోస్టులను రిజర్వ్​ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

4 సంవత్సరాలు మాత్రమే!
అగ్నివీర్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఇండియన్​ నేవీ యాక్ట్​ 1957, ప్రకారం నేవీలో 4 సంవత్సరాలు మాత్రమే సేవలందిస్తారు. నౌకాదళంలోని ర్యాంకులకు భిన్నమైన ర్యాంక్​ ఈ అగ్నివీర్​లది.

వయోపరిమితి
ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​ 2003 నోటిఫికేషన్​ ప్రకారం, నేవీలో అగ్నివీర్​ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2002 నవంబర్​ 1 నుంచి 2006 ఏప్రిల్​ 30లోపు జన్మించినవారై ఉండాలి. అంటే సుమారు 17 నుంచి 21 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.

విద్యార్హతలు
అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించిన బోర్డు స్కూల్​ పరీక్షల్లో మ్యాథ్స్​, ఫిజిక్స్​లో కచ్చితంగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్​ సైన్స్​ల్లో ఏదో ఒక సబ్జెక్ట్​ కూడా చదవి ఉండాలి.

జీతభత్యాలు
అగ్నివీర్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,500; నాలుగో ఏడాది రూ.40,000 చొప్పున జీతం ఇస్తారు. వీటితో పాటు ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. అభ్యర్థుల బేసిక్​ శాలరీలో 30 శాతానికి సరిపడా సొమ్ము కార్పస్​ ఫండ్​గా ఉంటుంది. ఈ విధంగా నాలుగేళ్లకు అగ్నివీర్​లకు రూ.10.04 లక్షల రూపాయల కార్పస్​ ఫండ్​ అందుతుంది.

ఎంపిక విధానం
అభ్యర్థులకు మొదటిగా కంప్యూటర్​ బేస్డ్​ ఆన్​లైన్​ పరీక్ష ద్వారా షార్ట్​లిస్ట్​ చేస్తారు. తరువాత రాత పరీక్ష, పీఎఫ్​టీ (శారీరక దృఢత్వ పరీక్షలు) , మెడికల్​ ఎగ్జామినేషన్​ చేస్తారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులను అగ్నివీర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఎలా చేయాలి?
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేయాలి. ఇతర విధానాల్లో అప్లై చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ​ 2023 జూన్ 15.

పరీక్ష ఫీజు
అభ్యర్థులు ఆన్​లైన్​లో పరీక్ష ఫీజు రూ.550లతో పాటు అదనంగా జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు కట్టినవారికి మాత్రమే అడ్మిట్​కార్డులు వస్తాయి. ఈ విషయం అభ్యర్థులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

Last Updated : Jun 9, 2023, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details