డ్రోన్లు సులభంగా దొరుకుతుండటం వల్ల భద్రతా సవాళ్లు మరింత పెరిగినట్లైందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు భారత సైన్యం తన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తెలిపారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. డ్రోన్ల ద్వారా కలిగే ముప్పు గురించి భద్రతా దళాలకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు.
"ఇతర దేశాల మద్దతుతో జరిగే దాడులతో పాటు, స్వయంగా ఆయా దేశాల వల్ల ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు మా సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. డ్రోన్ల నుంచి ప్రత్యక్ష, పరోక్ష ముప్పును ఎదుర్కొనేలా సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాం."
-జనరల్ నరవణె, ఆర్మీ చీఫ్