ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు కల్పించేలా ఇటీవల భారతీయ కేంద్ర వైద్య మండలి(సీసీఐఎం) తీసుకొచ్చిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఒక్క రోజు ధర్నా చేపట్టనున్నట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) వెల్లడించింది. ఆధునిక వైద్యం చేసే వైద్యులందరూ డిసెంబరు 11న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అత్యవసర సేవలు, కొవిడ్ సంబంధ సేవలు మినహా ఇతర విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఆరోజు సాధరణ శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించరాదని నిర్దేశించింది.
11న వైద్య విధులు బహిష్కరించండి: ఐఎంఏ - ఐఎంఏ
ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలు కల్పించేలా తీసుకొచ్చిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఒక రోజు ధర్నా చేపట్టనున్నట్లు భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) వెల్లడించింది. డిసెంబర్ 11న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆధునిక వైద్యం చేసే వైద్యులందరూ విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
భారతీయ వైద్య సంఘం
దీంతోపాటు డిసెంబరు 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ బహిరంగ నిరసన చేపట్టాలని కోరింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 20 మందికి మించని బృందాలతో ధర్నా చేయాలని సూచించింది. దీన్ని ఆధునిక వైద్యం చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమంగా ఐఎంఏ పేర్కొంది.
ఇదీ చూడండి:ఔషధ వ్యవస్థ అనుసంధానాన్ని తప్పుబట్టిన ఐఎంఏ