తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డోలో మాత్రపై ఇండియా మ్యాప్.. బాలిక ప్రతిభకు రికార్డులు దాసోహం!

Indian map on Dolo tablet: ప్రతిభకు వయసుతో సంబంధం లేదంటారు. కొన్ని సందర్భాలలో పెద్దలకు కష్టతరమైన పనులను కూడా పిల్లలు సాధిస్తారు, ఔరా అనిపిస్తారు. సరిగ్గా ఆ కోవలోకే వస్తుంది కేరళకు చెందిన 14 ఏళ్ల బాలిక. డోలో మాత్రపై ఏకంగా భారత్‌ చిత్ర పటాన్ని గీసింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Indian map in Dolo tablet
Indian map in Dolo tablet

By

Published : Apr 13, 2022, 12:47 PM IST

డోలో మాత్రపై ఇండియా మ్యాప్

Indian map on Dolo tablet: ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. దానిని వెలికితీసి గుర్తించిన వారే గొప్పవారవుతారు. కేరళ కాసరగోడ్ జిల్లాకు చెందిన భవ్య అనే బాలిక చిన్నతనంలోనే అరుదైన ఘనత సాధించింది. భారత మ్యాప్​ను డోలో మాత్రపై చిత్రీకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. 1.5 సెంటీమీటర్ల ఎత్తు, 1.2 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఇంత చిన్న పరిమాణంపై భారత చిత్రపటాన్ని గీసి, ప్రతిభకు వయసుతో సంబంధం లేదని రుజువు చేస్తోంది.

డోలో మాత్రపై భారతదేశ చిత్రపటం
బాటిల్​పై తమిళ నటుడు విజయ్ ఫొటో

Kerala girl Bhavya Dolo:ఇవే కాకుండా సచిన్ తెందూల్కర్‌, మలయాళ నటుడు మమ్ముటీ చిత్రపటాలను బాటిల్స్​పై చిత్రికరించింది. వీటి కోసం కరోనా లాక్‌డౌన్‌లో దొరికిన సమయాన్ని ఉపయోగించుకున్నట్లు ఈ బాలిక తెలిపింది. ఆ సమయంలో 65కు పైగా వివిధ రకాలైన చిత్రలేఖనాలు బాటిల్స్​పై చిత్రించినట్లు తెలిపింది. ఇవే కాకుండా పాకెట్ మనీ అవసరాల కోసం కేకులు తయారు చేసి అమ్ముతూ కొంత డబ్బు సంపాదిస్తొంది. పిట్టకొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో మరి.

బాటిళ్లపై అందమైన చిత్రాలు

తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ బాలిక ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకుంటోంది. తన తల్లిదండ్రుల పూర్తి సహకారం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని అంటోంది.

చిత్రాలు వేస్తున్న భవ్య
రికార్డులతో భవ్య

ఇదీ చదవండి:చిట్టి చేతులతో అద్భుతాలు.. రెండున్నరేళ్లకే ప్రపంచ రికార్డులు

ABOUT THE AUTHOR

...view details