తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ 67 అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా.. వెంటనే బ్లాక్​ చేయాలని ఆదేశాలు

ఇంటర్నెట్‌లో 67 అశ్లీల వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది

Indian government orders ban on 67 porn sites in a country
Indian government orders ban on 67 porn sites in a country

By

Published : Sep 29, 2022, 10:00 PM IST

అంతర్జాలంలో అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 67 వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతోపాటు పుణె ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు 63 వెబ్‌సైట్లను, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది.

అయితే ఇటీవలే అసత్య వార్తలు, మార్ఫింగ్‌ వీడియోలు, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లపై కూడా కేంద్రం కొరడా ఝుళిపించింది. ఇప్పటికే 10 యూట్యూబ్‌ ఛానెల్స్‌కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్‌ చేసింది. అగ్నిపథ్‌, ఆర్మీ, కశ్మీర్‌ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details