Interpol Election 2021: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో స్పెషల్ డైరెక్టర్గా పని చేస్తున్న ప్రవీణ్ సిన్హా (praveen sinha cbi).. ఆసియా ప్రతినిధిగా ఇంట్పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇంటర్పోల్లోని ఈ ఉన్నత ప్యానెల్‌లో రెండు స్థానాలు ఖాళీ కాగా.. వాటికి ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానాలకు చైనా, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జోర్డాన్ నుంచి ప్రవీణ్ సన్హాకు గట్టి పోటీ ఎదురైంది. చివరకు భారతీయ అభ్యర్థిగా ప్రవీణ్ విజయం సాధించారు.
ఇస్తాంబుల్లో ఇంటర్‌పోల్ (interpol news today) నిర్వహించిన 89 వ జనరల్ అసెంబ్లీలో భాగంగా ఈ ఎన్నికలు నిర్వహించినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన కారణంగా ఈ విజయం దక్కిందని చెప్పారు. భారత్తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలు, రాయబారులు, హై కమిషన్ల నుంచి ఈ ఎన్నికకు మద్దతు లభించిందని వెల్లడించారు.