ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సీ పరీక్షకు (Indian Army SSC Recruitment 2021) టెక్నికల్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. 2021 సెప్టెంబర్ 28న ఈ నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లికానివారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసేందుకు అర్హులు. (Indian Army SSC Technical Recruitment 2021) 191 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. (Indian Army SSC Tech)
అర్హతలు (Eligibility for SSC Tech)
- ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- పెళ్లి కాని మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 27.
- జేఏజీ ఎంట్రెన్స్ స్కీమ్ కోసం రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 29న ప్రారంభమైంది.
వయో పరిమితి(Age limit for Short Service Commission)
- ఎస్ఎస్సీ (టెక్నికల్) కోసం అభ్యర్థికి కనిష్ఠంగా 20 ఏళ్లు ఉండాలి. 2022 ఏప్రిల్ 1 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
- మరణించిన రక్షణ రంగ సిబ్బంది భార్యలకు గరిష్ఠ వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
రక్షణ సిబ్బంది వితంతువులకు కావాల్సిన విద్యార్హతలు:
- ఎస్ఎస్సీ డబ్ల్యూ (నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ)- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
- ఎస్ఎస్సీ డబ్ల్యూ (టెక్నికల్)- ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్
ఖాళీల వివరాలు(Vacancies in Army 2021)
- సివిల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ- 41
- ఆర్కిటెక్చర్-2
- మెకానికల్-20
- ఎలక్ట్రికల్; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 14
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్; కంప్యూటర్ టెక్నాలజీ; ఎమ్మెస్సీ కంప్యూటర్స్ ఎస్సీ- 32
- ఐటీ- 9
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్- 5
- టెలికమ్యూనికేషన్స్- 3
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్- 5
- శాటిలైట్ కమ్యూనికేషన్స్- 2
- ఎలక్ట్రానిక్స్- 2
- మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్- 2
- ఏరోనాటికల్; ఏరోస్పేస్; ఏవియోనిక్స్- 5
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్; ఇన్స్ట్రుమెంటేషన్- 4
- ఆటోమొబైల్ ఇంజినీరింగ్- 3
- ఇండస్ట్రియల్, ఇండస్ట్రియల్/ మానుఫాక్చరింగ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్- 2
రిమోట్ సెన్సింగ్; ప్రొడక్షన్; బాలిస్టిక్స్; బయోమెడికల్ ఇంజినీరింగ్; ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్; టెక్స్టైల్; ఫుడ్ టెక్నాలజీ; అగ్రికల్చర్; మెటలర్జికల్; మెటలర్జీ అండ్ ఎక్స్‌ప్లోజివ్; న్యూక్లియర్ టెక్నాలజీ; బయోటెక్; రబ్బర్ టెక్నాలజీ; కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలలో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు ఎలా?(How to apply for Short Service Commission)
- joinindianarmy.nic.in అనే వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తులు నింపే అవకాశం ఉంది.
- వెబ్సైట్లోకి వెళ్లి ఆఫీసర్ ఎంట్రీ లాగిన్‌పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టాలి.
- రిజిస్ట్రేషన్ అయ్యాక.. అప్లై ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత 'ఆఫీసర్స్ సెలెక్షన్-ఎలిజిబిలిటీ' అనే పేజీ ఓపెన్ అవుతుంది.
- 'షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్స్'కు ఎదురుగా ఉన్న అప్లై బటన్‌పై క్లిక్ చేయాలి
- దరఖాస్తులో అడిగిన వివరాలు నింపి సబ్మిట్ కొట్టాలి.
ఇదీ చదవండి: