Indian Army Recruitment 2023 :ఇండియన్ ఆర్మీలో పని చేయాలని ఆశించే ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తిచేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. తాజాగా ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ -51లో పర్మనెంట్ కమిషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ.. ఇండియన్ ఆర్మీ(Indian Army) రిలీజ్ చేసిన ఈ కొత్త రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ -51లో పర్మనెంట్ కమిషన్ స్థానం కోసం.. అర్హత కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. 90 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
వయోపరిమితి :ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా వయో పరిమితి 16 1/2 సంవత్సరాల నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు :ఈ ప్రవేశానికి అర్హత పొందేందుకు అభ్యర్థులు 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో కనీసం 60% మార్కులతో సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వివిధ రాష్ట్ర/కేంద్ర బోర్డుల PCM శాతాన్ని గణించడానికి అర్హత అవసరం కేవలం XII తరగతి మార్కులపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థి తప్పనిసరిగాJEE (మెయిన్స్) 2023 పాసై ఉండాలి.
శిక్షణ - వేతనాలు :ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2023 పర్మనెంట్ కమిషన్ భర్తీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుదారు 04 సంవత్సరాల శిక్షణా కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. శిక్షణ వ్యవధిలో దరఖాస్తుదారునికి రూ.13,940 చెల్లించబడుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత నెలవారీ జీతం రూ. 2,50,000 అందుతుంది.