గల్వాన్ ఘటన జరిగి నేటితో ఏడాది పూర్తైన వేళ.. అమరవీరులకు భారత సైన్యం నివాళి అర్పించింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఘర్షణలో మన సైనికులు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఈ ఘర్షణలో కర్నల్ సంతోష్ బాబు సహా.. 20 మంది సైనికులు అమరవీరులయ్యారు.
Galwan: అమర వీరులకు సైన్యం నివాళి - కర్నల్ సంతోష్ బాబు
తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య పెను ఘర్షణ జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా గల్వాన్‌లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించింది భారత సైన్యం.
భారత సైన్యం, గల్వాన్ వీరులు
ఘటన జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా... లేహ్‌లో ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పాలతో గల్వాన్ వీరులకు మేజర్ జనరల్ ఆకాశ్ కౌశిక్, ఆర్మీ ఛీఫ్ ఎమ్ ఎమ్ నరవాణే, భద్రతా దళాలు నివాళి అర్పించాయి. దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సైనికులకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోందని సైన్యం పేర్కొంది.
ఇదీ చదవండి:
Last Updated : Jun 15, 2021, 1:04 PM IST