పొరపాటున సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ యువకుడిని సైనికాధికారులు మానవతా దృక్పథంతో తిరిగి స్వదేశానికి పంపించారు. తీథ్వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత అధికారులు పాకిస్థాన్ అధికారులకు ఆ యువకుడిని అప్పగించారు. అతనికి కొత్త బట్టలు, మిఠాయిలు అందించారు.
పాకిస్థాన్ యువకుడ్ని అప్పగించిన భారత సైన్యం - ఆర్మీ
భారత సైన్యం మరోసారి గొప్ప మనసు చాటుకుంది. పొరపాటున సరిహద్దు దాటి వచ్చిన పాక్ యువకుడ్ని తిరిగి ఆ దేశానికి అప్పగించింది. అతనికి కొత్త బట్టలు, మిఠాయిలు కానుకగా ఇచ్చింది.
పాకిస్థాన్ యువకుడ్ని అప్పగించిన భారత సైన్యం
సదరు యువకుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లిపా ప్రాంతానికి చెందిన వాడని అధికారులు తెలిపారు. సోమవారం పొరపాటున నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోని కుప్వారాలోకి ప్రవేశించాడని ఆర్మీ అధికారులు చెప్పారు.