తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ ర్యాంకు! - భారత సైన్యంలో మరిన్ని శాఖల్లో మహిళలకు పదోన్నతలు

భారత సైన్యంలో ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్​ ర్యాంకు పదోన్నతి కల్పించడానికి సంబంధిత బోర్డు అంగీకరించింది. సైన్యంలో మరిన్ని విభాగాలకు మహిళా అధికారుల పదోన్నతిని విస్తరించడం.. లింగ వివక్షత పట్ల సైన్యం విధానాన్ని తెలియజేస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

Indian Army
ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ ర్యాంకు

By

Published : Aug 23, 2021, 5:18 PM IST

మహిళలకు కెరీర్​ అవకాశాలను మెరుగుపరచడం సహా సైన్యంలో లింగ వివక్ష తగ్గించే సంకేతాలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది భారత సైన్యం. 26 ఏళ్లు సేవలందించిన ఐదుగురు మహిళా అధికారులకు కల్నల్ (టైమ్ స్కేల్) ర్యాంకుకు పదోన్నతి కల్పించడాన్ని భారత సైన్యం ఎంపిక బోర్డు ఆమోదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కార్ప్స్​ ఆఫ్​ సిగ్నల్స్ నుంచి లెఫ్టినెంట్​ కల్నల్​ సంగీత సర్దానా, కార్ప్స్​ ఆఫ్​ ఈఎంఈ నుంచి లెఫ్టినెంట్​ కల్నల్​ సొనియా ఆనంద్​, లెఫ్టినెంట్​ కల్నల్​ నవనీత్ దుగ్గల్​, కార్ప్స్​ ఆఫ్​ ఇంజినీర్స్​ నుంచి లెఫ్టినెంట్​ కల్నల్​ రీను ఖన్నా, లెఫ్టినెంట్​ కల్నల్​ రిచా సాగర్​ కల్నల్ ర్యాంకుకు ఎంపికైనట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.​

మహిళలకు మరిన్ని అవకాశాలు

"భారత సైన్యంలోని మరిన్ని విభాగాల్లో మహిళా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించడం.. వారి కెరీర్​ అవకాశాలను మరింత పెంచడానికి సంకేతం. సైన్యంలోని ప్రధాన శాఖల నుంచి మహిళా అధికారులకు ప్రమోషన్​ కల్పించే శాశ్వత కమిషన్ నిర్ణయం.. లింగ వివక్ష పట్ల భారతీయ సైన్యం విధానాన్ని తెలియచేస్తోంది" అని రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

గతంలో కార్ప్స్​ ఆఫ్​ ఆర్మీ మెడికల్​ కార్ప్స్​, (ఏఎంసీ), జడ్జ్​ అడ్వకేట్​ జనరల్​(జేఏజీ), ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్​(ఏఈసీ)లో మాత్రమే మహిళా ఉద్యోగులకు కల్నల్ ర్యాంకు పదోన్నతలు ఉండేవి. తాజాగా కార్ప్స్​ ఆఫ్ సిగ్నల్స్​, కార్ప్స్​ ఆఫ్​ ఎలక్ట్రానిక్​, మెకానికల్​ ఇంజినీర్స్​(ఈఎంఈ), కార్ప్స్​ ఆఫ్ ఇంజినీర్స్​ విభాగాల్లోనూ కల్నల్​ ర్యాంకు పదోన్నతలు కల్పించడానికి భారత సైన్యం ఆమోదించింది.

ఇదీ చూడండి:కులాలవారీగా జనగణనపై మోదీతో బిహార్ నేతల భేటీ

ABOUT THE AUTHOR

...view details