జమ్ముకశ్మీర్లో మరో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. సైనిక బృందం, కశ్మీర్ పోలీసులు.. ఈ నెల 17, 18న చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో భాగంగా.. రియాసి జిల్లాలో ఈ స్థావరం బయటపడింది. అక్కడి నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఉగ్రస్థావరం గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్లో సైనిక బలగాలు, పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో భారీ ఆయుధాలు బయటపడ్డాయి. రియాసి జిల్లాలో ఈ ఉగ్రస్థావరాన్ని గుర్తించిన అధికారులు.. అక్కడి నుంచి పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఉగ్రస్థావరం గుట్టురట్టు- భారీగా ఆయుధాలు స్వాధీనం
రియాసీ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ స్థావరం బయటపడిందని అధికారులు తెలిపారు. అనంతరం.. అక్కడి నుంచి ఏకే47 రైఫిల్-1, ఎస్ఎల్ రైఫిల్-1, 303 బోల్ట్ రైఫిల్, చైనీస్ పిస్టల్స్-2 లను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. అంతేకాకుండా.. నాలుగు అండర్ బారెల్ గ్రెనేడ్ లాంఛర్(యూజీబీఎల్) గ్రెనేడ్లను గుర్తించినట్టు చెప్పారు అధికారులు.
ఇదీ చదవండి:ఈ ఏడాది వర్చువల్గా 'పరీక్షా పే చర్చ'