సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ఇరువైపులా ఆమోదయోగ్యమైన పరిష్కారానికి భారత్-చైనా అంగీకరించినట్లు భారత్ సైన్యం తెలిపింది. రెండు దేశాల మధ్య శుక్రవారం జరిగిన సైనిక భేటీలో సరిహద్దుల్లో పరిస్థితిపై నిర్మాణాత్మకంగా, లోతుగా సమాలోచనలు చేసినట్లు సైన్యం స్పష్టం చేసింది. అయితే... దాదాపు పదిన్నర గంటలపాటు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేనట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో విడత చర్చలు జరపడానికి ఇరు దేశాల సైన్యాధికారులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఎనిమిదో విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం! - India and china latest latest military talks
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిపిన ఎనిమిదో విడత చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇరు దేశాల మధ్య శుక్రవారం జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలపై నిర్మాణాత్మకంగా,లోతుగా సమాలోచనలు చేసినట్లు తాజాగా స్పష్టం చేసింది భారత సైన్యం.
ఎనిమిదో విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం
వీలైనంత త్వరగా వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని చర్చల్లో అంగీకారానికి వచ్చినట్లు వివరించింది భారత సైన్యం. సమస్యల పరిష్కారానికి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడానికి ఇరు దేశాలు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. విభేదాలను వివాదాలుగా మార్చకూడదని, సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని నెలకొల్పాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.