Indian Air Force Agniveer Jobs 2023 : భారత వాయు సేన ఏడాదికి రెండు సార్లు అగ్నివీర్వాయు పోస్టులకు ప్రకటన విడుదల చేస్తోంది. తాజాగా 3500కు పైగా అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి అగ్నివీర్‌వాయులో సైన్స్, నాన్-సైన్స్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సైన్స్ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు, నాన్ సైన్స్ పోస్టులకు కూడా పోటీపడవచ్చు. ఇందుకోసం ప్రత్యేక పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://agnipathvayu.cdac.in/AV/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు
Agniveer Airforce Qualification : వాయుసేన అగ్నివీర్వాయు పోస్టులకు.. ఇంటర్మీడియట్ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు కూడా ఈ పోస్టులకు అర్హులే.
- సైన్స్ విభాగం :ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా నిర్దేశిత డిప్లొమా కోర్సుల్లో 50 శాతం మార్కులతో పాస్ అయ్యుండాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- నాన్ సైన్స్ విభాగం : ఇంటర్లో ఏదైనా నాన్-సైన్స్ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సులో 50 శాతం మార్కులతో పాస్ అయ్యుండాలి.
- నోట్ : అభ్యర్థులు ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ 10వ తరగతి/ఇంటర్/డిప్లొమా/ఒకేషనల్.. ఎందులోనైనా ఇంగ్లీష్‌లో 50% మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి
Agniveer Airforce Age Limit : అభ్యర్థులు 2003 జూన్ 27 నుంచి 2006 డిసెంబర్ 27 మధ్య జన్మించి ఉండాలి.
పరీక్ష ఫీజు
Agniveer Fees Payment : అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
Agniveer Selection Process 2023 : అభ్యర్థులకు రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టులు చేసి, అందులో ఉత్తీర్ణత సాధించినవారిని పోస్టులకు ఎంపిక చేస్తారు.
శారీరక ప్రమాణాలు
Agniveer Physical Eligibility : పురుషులు 152.5 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి. మహిళలు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు ఛాతీ 5 సెం.మీ వరకు వ్యత్యాసం చూపించాలి.