కల్లోలిత అఫ్గానిస్థాన్(Afghan Crisis) నుంచి భారతీయులతోపాటు ఇతర దేశాల పౌరుల తరలింపు కార్యక్రమం.. 'ఆపరేషన్ దేవీశక్తి' కొనసాగుతోంది. కాబుల్ నుంచి మరో 35మందితో భారత వాయుసేన(Indian Air Force) విమానం దిల్లీకి బయలుదేరింది. అందులో 24 మంది భారతీయులు కాగా మరో 11 మంది నేపాలీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈనెల 15న కాబుల్‌ను తాలిబన్లు(Taliban Afghanistan) ఆక్రమించగా.. భారత్ సహా పలుదేశాలు తమ పౌరులను స్వదేశాలకు తరలిస్తున్నాయి. మరోవైపు.. భారత్‌లో తాత్కాలిక ఆవాసం పొందాలనుకుంటున్న అఫ్గాన్ పౌరులు ఈ-వీసాలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది.