తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IAF Made In India Projects : వాయుసేన 'మేక్ ఇన్ ఇండియా' మంత్రం.. రూ.3.15లక్షల కోట్లతో భారీ ప్లాన్! - ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ లెటెస్ట్ ప్రాజెక్ట్​

IAF Made In India Projects : దేశ రక్షణ రంగంలో భారీ మార్పులు రానున్నాయి. మొత్తం రూ.3.15లక్షల కోట్లతో దేశీయంగా ఫైటర్​ జెట్స్​, స్పై ప్లేన్స్​, ఛాపర్స్​, మిసైల్స్​తో పాటు అధునాతన ఆయుధ వ్యవస్థలను సమీకరించుకోవాలని యత్నిస్తోంది.

indian-air-force-biggest-indigenisation-projects-worth-over-rs-3-lakh-crore
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 1:11 PM IST

IAF Made In India Projects :స్వదేశీ ఆయుధాలకు పెద్ద పీట వేసేందుకు భారత వాయుసేన సిద్ధమైంది. ఫైటర్​ జెట్స్​, స్పై ప్లేన్స్​, ఛాపర్స్​, మిసైల్స్​ వంటివి దేశీయంగానే సమకూర్చుకోవాలని నిర్ణయించింది. మేక్​ ఇన్​ ఇండియాలో భాగంగా మొత్తం రూ.3.15లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి వెల్లడించారు. 7 నుంచి 8 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్​లను పూర్తి చేయనున్నట్లు చౌదరి తెలిపారు.

ఈ ప్రాజెక్ట్​ల్లో భాగంగా 180 లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ Mark1A, 156 లైట్ కంబాట్ హెలికాప్టర్లు, లైట్ యుటిలిటీ ఛాపర్స్​ను సమీకరించుకోనుంది ఇండియన్ ఎయిర్​ఫోర్స్​. ఇప్పటికే 83 విమానాలకు కాంట్రాక్టులు ఇచ్చింది. మరో 97 ఎయిర్​క్రాప్ట్​లకు త్వరలోనే క్లియరెన్స్ రానుంది. మరోవైపు, కాలం చెల్లినవిగా భావిస్తున్న మిగ్-21 విమానాల వినియోగాన్ని 2025 నాటికి పూర్తిగా నిలిపివేస్తామని ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి వెల్లడించారు. వాటిని పూర్తిగా మార్క్ 1ఏలతో భర్తీ చేసుకుంటామని చెప్పారు. వీటితో పాటు వివిధ రకాల ఆయుధ వ్యవస్థలను కూడా సిద్ధం చేసుకునేందుకు ఐఏఎఫ్ ప్రణాళికలు రూపొందిస్తోంది.​ LCA మార్క్​1Aల తయారీ విలువ రూ.1.2లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్​ దేశీయంగా కీలక పరిణామాలకు నాంది పలుకుతుందని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. దేశీయంగా భారీ డిఫెన్స్​ ఇండస్ట్రీని నిర్మించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం వస్తుందని అంటున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లుగా 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఇది మద్దతుగా నిలవచ్చని వారు వివరిస్తున్నారు.

రూ.3.15లక్షల కోట్లతో దేశీయంగా ఫైటర్​ జెట్స్​, స్పై ప్లేన్స్​, ఛాపర్స్​, మిసైల్స్ తయారీ

65వేల కోట్లతో Su-30MKI ఫైటర్​ జెట్ అప్​డేట్​..
మొత్తం 65వేల కోట్ల రూపాయలతో Su-30MKI ఫైటర్​ జెట్​లకు అప్​గ్రేడ్​ చేయనున్నట్లు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ తెలిపింది. ఇందులో స్వదేశీ రాడార్లు, ఏవియానిక్స్, ఆయుధాలు అమర్చనున్నట్లు వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహకారంతో ఈ ప్రాజెక్ట్​ను పూర్తి చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈ అంశం రక్షణ శాఖ పరిధిలో ఉందని.. త్వరలోనే అత్యున్నత స్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరుగుతుందని ఎయిర్​ ఫోర్స్​ అధికారులు తెలిపారు. మొదట 90 ఎయిర్​క్రాప్ట్​లను అప్​డేట్​ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. క్రమంగా మిగతా వాటిని కూడా అప్​డేట్​ చేయనున్నట్లు తెలిపారు.

రూ.3.15లక్షల కోట్లతో దేశీయంగా ఫైటర్​ జెట్స్​, స్పై ప్లేన్స్​, ఛాపర్స్​, మిసైల్స్ తయారీ

స్పై విమానాలు, లైట్​ కాంబాట్​ హెలికాప్టర్ల అభివృద్ధి..
స్పై విమానాలను కూడా అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది ఇండియన్ ఎయిర్​ఫోర్స్​. ఈ విమానాలతో ప్రత్యర్థుల చర్యలను సులువుగా పసిగట్టవచ్చని ఎయిర్​ఫోర్స్​ భావిస్తోంది. అదే విధంగా ఇప్పుడున్న చీతా హెలికాప్టర్​ల స్థానంలో లైట్ యుటిలిటీ హెలికాప్టర్​లను తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్​ ప్రణాళికలు రూపొందిస్తోంది. ​మొత్తం రూ.45వేల కోట్లతో 156 లైట్​ కాంబాట్​ హెలికాప్టర్లను తయారు చేయనుంది ఇండియన్​ ఎయిర్​ఫోర్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధ్వర్వంలో తయారవుతున్న ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ ప్రోగ్రామ్​కు కూడా ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ మద్ధతునిస్తోంది.

రూ.3.15లక్షల కోట్లతో దేశీయంగా ఫైటర్​ జెట్స్​, స్పై ప్లేన్స్​, ఛాపర్స్​, మిసైల్స్ తయారీ

ప్రాజెక్ట్ కుషా..
ప్రాజెక్ట్ కుషాలో భాగంగా 5 యూనిట్ల లాంగ్​ రేంజ్​ సర్ఫేస్​ ఎయిర్​ మిసైల్​ను ఎయిర్ ఫోర్స్​ తయారు చేయనుంది. రష్యా తయారు చేస్తున్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలతో సమానంగా పని చేసే సామర్థ్యం వీటికి ఉందని రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం రూ.21,700 కోట్లను ఈ ప్రాజెక్ట్​పై ఖర్చు చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అదే విధంగా 7500 కోట్ల రూపాయలతో ఆయుధ వ్యవస్థను తయారు చేసేందుకు ఎయిర్ ఫోర్స్​ సిద్ధంగా ఉంది. అందుకోసం రక్షణ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది.

C 295 Transport Aircraft India : భారత వాయుసేనలోకి పవర్​ఫుల్ విమానం.. తొలి సీ-295ని అందజేసిన ఎయిర్​బస్

Sukhoi 30 Mki India : స్వదేశీ మంత్రంతో భారత్​.. సుఖోయ్‌లు.. సర్వే నౌకలు.. రూ.45వేల కోట్లతో రక్షణశాఖ​ డీల్​!

ABOUT THE AUTHOR

...view details