భారత్ ఎప్పుడూ అఫ్గాన్ ప్రజల పక్షాన నిలబడుతుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి హనిఫ్ ఆత్మర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. అఫ్గాన్ నుంచి దళాల పూర్తి ఉపసంహరణపై అమెరికా ప్రకటన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో పొరుగుదేశాల పాత్ర చర్చకు వచ్చినట్లు జైశంకర్ తెలిపారు.
"ప్రస్తుత పరిణామాలపై అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రితో మంచి సంభాషణ జరిగింది. అఫ్గాన్ శాంతి ప్రక్రియలో పొరుగుదేశాల పాత్ర గురించి చర్చించాం. ఎప్పటిలాగే, అఫ్గానిస్థాన్ ప్రజల పక్షాన భారత్ నిలబడుతూనే ఉంటుంది."