తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చైనా అంగీకరిస్తే తప్ప.. భారత్ తన బలగాలను ఉపసంహరించుకోదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చల ద్వారా ఒక పరిష్కారం లభిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారాయన. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలపై చైనా అభ్యంతరం తెలపడాన్ని తప్పు పట్టిన రాజ్‌నాథ్.. మరింత వేగంగా భారత ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాల గురించి మాట్లాడారు.
భారత బలగాల ఉపసంహరణపై మాట్లాడిన రాజ్‌నాథ్.. మొదట చైనా ఆ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. నిర్ణీత గడువులోగా ప్రతిష్టంభనను తొలగించాలనే నియమమేదీ లేదన్న మంత్రి.. చైనాతో చర్చల ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు.
ఉన్నతస్థాయి చర్చలు..
జనవరి 19న ఉన్నత స్థాయి చర్చలకు చైనా ప్రతిపాదించిందని రాజ్‌నాథ్ తెలిపారు. అయితే సమావేశానికి ఒక్క రోజు ముందు సమాచారం అందిందని పేర్కొన్నారు. జనవరి 23 లేదా 24న తేదీలకు రీషెడ్యూల్ చేయమని కోరామన్నారు. భారత్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉద్ఘాటించారు.