దేశంలో జాతీయ రహదారుల రూపు పూర్తిగా మారబోతోందని కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాబోయే మూడేళ్లలో దేశంలో అమెరికా స్థాయి రహదారులు చూడుబోతున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుందని చెప్పారు. గుజరాత్‌లోని దీశా పట్టణంలో 3.75 కిలోమీటర్ల పొడువుగల నాలుగు లేన్ల రహదారి ప్రారంభం సందర్భంగా ఆయన శనివారం వర్చువల్‌గా మాట్లాడారు.
భారత్‌మాల..
దేశంలో ప్రస్తుతం రోజకు 38 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని గడ్కరీ తెలిపారు. ఒకప్పుడు కిలోమీటర్ కంటే తక్కువగా ఉండేవని చెప్పారు. భారత్‌మాల పరియోజన పథకం కింద గుజరాత్‌లో 1080 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. అలాగే దిల్లీ-ముంబయి మధ్య ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.
గుజరాత్‌లోని ఏడు జిల్లాల మీదుగా ఈ రహదారి పోనుందని చెప్పారు. రహదారుల నిర్మాణానికి అడ్డుగా ఉన్న భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి సూచించారు. ఈ సందర్భంగా పలు రహదారి ప్రాజెక్టుల గురించి వివరించారు.
ఇవీ చదవండి: