పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ ఏదో ఒక రోజు తన వశం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు వాయుసేన ఉన్నతాధికారి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్. కానీ ప్రస్తుతానికి పీవోకే గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. బుద్గాంలో సైన్యం అడుగుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
'పీఓకే గురించి ఇంకా ప్లాన్ చేయలేదు.. కానీ త్వరలోనే..' - కశ్మీర్ న్యూస్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకునే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని భారత వాయుసేన ఉన్నతాధికారి తెలిపారు. కానీ ఏదో ఒకరోజు ఆ ప్రాంతమంతా భారత్ వశమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'పీఓకే గురించి ఇంకా ప్లాన్ చేయలేదు.. కానీ త్వరలోనే..'
"1947 అక్టోబర్ 27న సైన్యం, వాయుసేన చేపట్టిన ఆపరేషన్ వల్లే కశ్మీర్‌కు స్వేచ్ఛ లభించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలను అక్కడి ప్రభుత్వం సరిగ్గా చూడటం లేదు. ఏదో ఒకరోజు పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీర్ కూడా ఈ ప్రాంత కశ్మీర్‌లో చేరుతుందని కచ్చితంగా చెప్పగలను." అని అమిత్ దేవ్ అన్నారు.